General practitioner gets sued by her client's daughter for millions for allowing her birth: తన తల్లికి డెలివరీ చేసి.. తనను ఈ భూమ్మీదికి తీసుకొచ్చిన డాక్టర్‌పైనే ఒక యువతి కేసు పెట్టింది. బ్రిటన్‌కు చెందిన 20 ఏళ్ల యువతి డాక్టర్‌పై దావా వేసింది. తన తల్లి గర్భిణీగా ఉన్నప్పుడు ట్రీట్‌మెంట్ చేసిన డాక్టర్ వల్లే ప్రస్తుతం తనకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఫిర్యాదులో పేర్కొంది.
బ్రిటన్‌కు చెందిన ఈవీ టూంబెస్‌కు (Evie Toombes) పుట్టగానే అరుదైన వ్యాధి సోకింది. ఆ వ్యాధి పేరు లిపోమ్యేలోమెనింగోసెలే (lipomyelomeningocele). ఈ వ్యాధి వల్ల ఆ యువతి వెన్నుముక పని చేయడం లేదు. తల్లి కడుపులో ఉన్నప్పుడే ఆమె వెన్నుముక (spinal cord) వృద్ధి చెందలేదు. దీంతో ఆమె పుట్టాక ఆ సమస్య వల్ల ఆమె నిటారుగా నిలబడలేక పోతోంది. ఇప్పుడు ఆమె శాశ్వతంగా మంచానికే పరిమితమైంది.
ప్రెగ్నెన్సీ (Pregnancy) సమయంలో తన తల్లికి కావాల్సిన మెడిసిన్‌ను ఇవ్వకుండా, అలాగే ట్రీట్‌మెంట్ సరిగ్గా చేయకపోవడంతోనే తనకు ఈ పరిస్థితి వచ్చిందని డాక్టర్‌పై దావా వేస్తున్నట్టు టూంబెస్ (Evie Toombes) పేర్కొన్నారు. అప్పుడు తనకు సరిగ్గా ట్రీట్‌మెంట్ చేసి ఉంటే ఇప్పుడు తనకు పరిస్థితి ఇలా ఉండేది కాదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read : Siva Shankar master health condition: శివ శంకర్ మాస్టర్‌కి సోను సూద్ సహాయం
ఇక ఈ కేసును విచారించిన కోర్టు, టూంబెస్ సమస్యను తెలుసుకుంది. కానీ ఆ డాక్టర్ (Doctor) మాత్రం ఈవీ టూంబెస్ ఆరోపణలను కొట్టిపారేశాడు. తను సరిగ్గానే వైద్యం చేశానని, వెన్నుముక లోపంతో ఈవీ టూంబెస్ (Evie Toombes) పుట్టడం తన తప్పు కాదని స్పష్టం చేశాడు.
Also Read : Drushyam 2 Review: ఊహించని ట్విస్టులతో 'దృశ్యం 2' మూవీ.. వెంకీ మామ నటన హైలెట్..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook