Republic Day 2024: గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌!

Republic Day 2024 Celebrations: 2024 రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌ రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయనకు ఇప్పటికే కేంద్రం నుంచి  ఆహ్వానం  వెళ్లినట్లు సమాచారం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2023, 06:51 PM IST
Republic Day 2024: గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌!

 2024 Republic Day Chief Guest: వచ్చే ఏడాది గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానియేల్‌ మెక్రాన్‌ (Emmanuel Macron) ముఖ్య అతిథిగా రానున్నారు. అయితే ఈ వేడుకలకు ముందుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden)ను ఆహ్వానించినట్లు భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల బైడెన్‌(Joe Biden) రాలేనని చెప్పడంతో ఫ్రాన్స్‌ అధ్యక్షుడిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జులైలో పారిస్‌లో జరిగిన ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవ బాస్టిల్‌ డే పరేడ్ (Bastille Day Parade)లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. 

ఈ సంవత్సరం సెప్టెంబరు 9, 10 తేదీల్లో జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో జరిగిన ఈ సదస్సులో ఇమ్మానియేల్‌ మెక్రాన్‌ పాల్గొన్నారు. భారత్‌-ఫ్రాన్స్‌ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రధాని మోదీతో చర్చలు జరిపినట్లు ఈ సందర్భంగా మెక్రాన్ వెల్లడించారు. బాస్టిల్‌ డే పరేడ్‌కు మోదీ రావడాన్ని తమ దేశ ప్రజలు గౌరవంగా భావించారని ఆయన తెలిపారు. అయితే ఇండియా రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్యాన్స్ నేతలు ముఖ్య అతిథులుగా రావడం ఇది ఆరోసారి. మెక్రాన్ కంటే ముందు 1976, 1998లో ఆ దేశ ప్రధాని జాక్వెస్ చిరాక్, 1980లో మాజీ అధ్యక్షులు వాలెరీ గిస్కార్డ్ డి ఎస్టేయింగ్, 2008లో మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ, 2016లో మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ గణతంత్ర వేడుకలకు చీఫ్ గెస్టులుగా వచ్చారు. 2023 గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా అల్‌సీసీ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. 

Also Read: Aditya L1: తుది లక్ష్యానికి చేరువలో ఆదిత్య ఎల్ 1, జనవరి 6న ఎల్ 1 పాయింట్ చేరనున్న మిషన్ ఆదిత్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Aditya L1 MissionISROIndian Space Research OrganisationL1 Point

Trending News