Foetus inside Woman's Liver: ప్రెగ్నెన్సీకి సంబంధించి ఇదో అరుదైన కేసు. సాధారణంగా మహిళల గర్భాశయంలో ప్రెగ్నెన్సీ వస్తుంది. కొన్నిసార్లు ఫెలోపియన్ ట్యూబ్‌లోనూ గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అక్కడ పిండం ఎదుగుదలకు తగినంత స్పేస్ ఉండదు కాబట్టి.. వైద్యులు దాన్ని తొలగిస్తారు. ఇందుకు భిన్నంగా కెనడాకు (Canada) చెందిన ఓ మహిళకు కాలేయ భాగంలో ప్రెగ్నెన్సీ వచ్చింది. వైద్యశాస్త్రంలో ఇలాంటి కేసులు అత్యంత అరుదుగా చెబుతున్నారు.
కెనడా డాక్టర్ డా.మైకెల్ నార్వే ఈ అరుదైన కేసుకు (Highly Rare Pregnancy Case) సంబంధించి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. '14 రోజులుగా రుతుస్రావం అవుతుండటంతో.. ఓ 33 ఏళ్ల మహిళ ఆసుపత్రికి వచ్చారు. 49 రోజుల తర్వాత ఆమెకు రుతుస్రావమైనట్లు చెప్పారు. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించగా... ఆమె కాలేయంలో పిండాన్ని గుర్తించాం.' అని డా.మైకెల్ వెల్లడించారు.
సాధారణంగా కొన్నిసార్లు పొత్తికడుపులో ప్రెగ్నెన్సీ వస్తుంటుందని.. కానీ ఇలా కాలేయంలో ప్రెగ్నెన్సీ (Pregnancy inside Liver) రావడం తాను మొదటిసారి చూస్తున్నానని మైకెల్ తెలిపారు. గర్భాశయంలో కాకుండా ఇతర భాగాల్లో ఏర్పడే ప్రెగ్నెన్సీని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా పేర్కొంటారని చెప్పారు. ఫెలోపియన్ ట్యూబ్‌లో అండం, శుక్ర కణంతో కలిశాక ఫలదీకరణం చెందుతుందని.. అక్కడి నుంచి అది గర్భాశయంలోకి కాకుండా ఇతర భాగాల్లోకి చేరడం, లేదా ట్యూబ్‌లోనే ఉండిపోతే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా పరిగణిస్తారని తెలిపారు. అయితే ఇలా కాలేయంలో ప్రెగ్నెన్సీ రావడం అత్యంత అరుదని పేర్కొన్నారు.
నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. 1964-1999 మధ్య 14 ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కేసుల్లో (Viral News) కాలేయ భాగంలో ప్రెగ్నెన్సీని గుర్తించారు. ఇలాంటి కేసుల్లో ప్రెగ్నెన్సీని త్వరగా గుర్తించి తొలగించకపోతే చాలా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. తాజాగా కెనడాకు చెందిన మహిళకు... కాలేయ భాగం నుంచి ప్రెగ్నెన్సీని తొలగించి వైద్యులు ఆమె ప్రాణాలు కాపాడినట్లు తెలుస్తోంది.
Also Read: 156 Kidney stones: ఆ పేషెంట్ కిడ్నీ నుంచి 156 రాళ్లు తొలగించిన వైద్యులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook