అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దానగుణాన్ని చాటుకున్నారు. ఒక అధ్యక్షుడిగా ప్రభుత్వం నుండి తాను తీసుకొనే జీతాన్ని ఆయన ప్రభుత్వ వైద్య, మానవ సేవల శాఖకు విరాళంగా ఇచ్చేశారు. ఒపియోయిడ్ ఎపిడెమిక్ బాధితుల కోసం తన మూడో త్రైమాసిక జీతాన్ని ఉపయోగించాల్సిందిగా ఆయన వైద్యశాఖకు తెలిపారు. అధిక మోతాదులో పెయిన్ కిల్లర్స్ వాడుతూ.. వాటికి వ్యసనపరులుగా మారే వ్యక్తులనే ఒపియోయిడ్ ఎపిడెమిక్స్ అంటారు.
అమెరికాలో ప్రతీ రోజు దాదాపు 175 మంది ఒపియోయిడ్ ఎపిడెమిక్ వల్ల చనిపోతున్నారట. గతంలో కూడా తన జీతాన్ని ట్రంప్ విరాళంగా ఇచ్చేసిన దాఖలాలు ఉన్నాయి. తన తొలి త్రైమాసిక జీతాన్ని అమెరికా పార్కుల డెవలప్‌మెంట్‌కి, రెండవ త్రైమాసిక జీతాన్ని విద్యార్థుల వికాసానికి ఉపయోగించాల్సిందిగా ఆయన కోరారు. ప్రసుత్తం ట్రంప్ వార్షిక వేతనం నాలుగు లక్షల డాలర్లు.