Penny Wong Marriage: ప్రపంచంలో వివాహ వ్యవస్థలో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి. లింగ బేధం లేకుండా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. మహిళను మహిళలు, పురుషులను పురుషులు వివాహం చేసుకుంటున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటినే స్వలింగ వివాహాలుగా చెబుతున్నారు. కొన్ని దేశాల్లో ఈ పెళ్లిళ్లకు చట్టబద్ధత కూడా ఉంటుండడం గమనార్హం. తాజాగా ఓ మహిళా మంత్రి ఓ మహిళను వివాహం చేసుకుంది. ఈ వేడుక ఆస్ట్రేలియాలో జరిగింది.
Also Read: KCR House: మాజీ సీఎం కేసీఆర్ ఇంటికి తాగునీటి ఇబ్బందులు.. నీరు రాకుండా రేవంత్ రెడ్డి కుట్రనా?
ఆస్ట్రేలియాకు చెందిన పెన్నీ వాంగ్ అక్కడి రాజకీయాల్లో కీలక నాయకురాలిగా ఉన్నారు. అయితే ఆమె స్వలింగ సంపర్కురాలు. అంటే మహిళలను ఇష్టపడే వ్యక్తి. ఆంగ్లంలో లెస్బియన్ అంటారు. ఆమె ప్రస్తుతం దక్షిణ ఆస్ట్రేలియా నుంచి సెనేట్‌గా వ్యవహరిస్తున్న ఆమె విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు. దేశంలోనే తొలి స్వలింగ సంపర్క పార్లమెంటేరియన్‌గా ఘనత సాధించారు. తాజాగా ఆమె కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న మహిళను తాజాగా పెన్నీ వాంగ్ వివాహం చేసుకుంది. సోఫీ అల్లోచెతో ఇరవై ఏళ్లుగా పెన్నీ వాంగ్ కలిసి జీవిస్తోంది. వారి అనుబంధాన్ని పెళ్లితో మరింత బలోపేతం చేసుకున్నారు. కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.
Also Read: Kavitha Arrest: కవిత అరెస్ట్ వెనకాల ఉన్న కథ ఇదే.. ఢిల్లీ కుంభకోణం అంటే ఏమిటి?
తమ పెళ్లి ఫొటోలను పెన్నీ వాంగ్ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'మా వివాహం కుటుంబసభ్యుల మధ్య జరగడం మధ్య జరగడం చాలా సంతోషంగా ఉంది' అని ఆమె ట్వీట్ చేసింది. అయితే వీరి వివాహానికి చట్టబద్ధత ఉండడం గమనార్హం. ఎందుకంటే 2017లో ఆస్ట్రేలియా ప్రభుత్వం స్వలింగ వివాహానికి చట్టబద్ధత కల్పించిన విషయం తెలిసిందే. గతంలో నేరంగా ఉండే స్వలింగ సంపర్క వివాహం ఇప్పుడు ఆస్ట్రేలియాలో చట్టబద్ధం కావడం గమనార్హం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook