TSPSC Chairman: నాది క్లీన్‌ రికార్డు.. నా ప్రతిష్ట దిగజార్చేందుకు తప్పుడు ప్రచారం

TSPSC Chairman: తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న పనులు, నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాటిలో ఉద్యోగాలు కల్పించే టీఎస్‌పీఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ నియామకం కూడా తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఈ సందర్భంగా చైర్మన్‌గా నియమితుడైన వ్యక్తిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే స్వయంగా చైర్మనే రంగంలోకి వివరణ ఇచ్చుకున్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 7, 2024, 12:00 AM IST
TSPSC Chairman: నాది క్లీన్‌ రికార్డు.. నా ప్రతిష్ట దిగజార్చేందుకు తప్పుడు ప్రచారం

TSPSC News: కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇటీవల తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌ రెడ్డిని నియమించింది. ఆయన నియమితుడైన రోజు నుంచి అతడిపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. అతడిపై పలు ఆరోపణలు చేస్తూ కొందరు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ మహేందర్‌ రెడ్డి స్వయంగా స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై వివరణ ఇచ్చుకున్నారు. తనపై నిరాధార ఆరోపణలు వస్తున్నాయని కొట్టిపడేశారు. పోలీస్‌ అధికారిగా, ఐపీఎస్‌ అధికారిగా ఉత్తమ సేవలు అందించానని తనకు తాను కితాబు ఇచ్చుకున్నారు. 

Also Read: VVIPS Aya Savitri: సినీ హీరోల 'పిల్లల కేర్‌ టేకర్‌' ఎవరో తెలుసా? వీవీఐపీల ఆయా ఎవరో తెలుసా?

'సోషల్‌ మీడియాలో వస్తున్న ఆరోపణలు దురదృష్టకరం. నేను 36 సంవత్సరాలకు పైగా ప్రజా సేవలో ఉన్నా. ఎలాంటి వివాదం లేకుండా పదవీ విరమణ వరకు అంకితభావంతో విధులు నిర్వర్తించా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పోలీస్‌ శాఖలో వివిద హోదాల్లో సుదీర్ఘ కాలం పాటు పని చేశా. నా కెరీర్‌ మొత్తంలో నేను క్లీన్‌ రికార్డుగా కొనసాగించాను. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాక నా ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం జరుగుతోంది' అని మహేందర్‌ రెడ్డి తెలిపారు.

Also Read: Cockroach Vande Bharat Train: భోజనంలో బొద్దింక.. 'వందే భారత్‌' ప్రయాణికుడికి విస్తుగొల్పే ఘటన

సోషల్‌ మీడియా వస్తున్న ఆరోపణలు, విమర్శలపై స్పందిస్తూ.. 'సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. అలా చేయడం చాలా దురదృష్టకరం. చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలు, నిరాధారమైనవి. అవి సత్యానికి దూరంగా ఉన్నాయి. నా ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారు, వాటిని వ్యాప్తి చేస్తున్న వారిపై క్రిమినల్‌ చర్యలు, పరువు నష్టం దాఖలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం' అని మహేందర్‌ రెడ్డి వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లో సీనియర్‌ పోలీస్‌ అధికారిగా మహేందర్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మహేందర్‌ రెడ్డి గత బీఆర్‌ఎస్‌ పార్టీ పాలనలో డీజీపీగా విధులు నిర్వర్తించారు. సుదీర్ఘ కాలం పాటు ఆ పదవిలో కొనసాగారు. అయితే అప్పట్లో డీజీపీగా ఉన్న మహేందర్‌ రెడ్డి నేటి అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. కానీ అనూహ్యంగా అధికారంలోకి వచ్చాక మహేందర్‌ రెడ్డికే కీలక బాధ్యతలు అప్పగించడం విశేషం. అందుకే మహేందర్‌ రెడ్డి నియామకంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News