‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ తెలంగాణలో ప్రభుత్వాసుపత్రుల పనితీరుపై తన ఆవేదనను వ్యక్తం చేశారు. కెమెరామెన్‌గా పనిచేస్తున్న ఆయన మిత్రుడు ఒకాయన ఆదివారం హైదరాబాదులోని ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడ వైద్యులు సరైన సమయంలో ట్రీట్ మెంట్ చేయడంతో తను చనిపోయారు. ఈ విషయాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ వద్దకు ట్విటర్ వేదికగా తీసుకెళ్లారు నాగ్ ఆశ్విన్.
"హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నా మిత్రుడు మరణించాడు సార్. ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ ఎవ్వరూ అందుబాటులో లేరు. మూడు గంటల పాటు ఆయన బాధను అణచిపెట్టి ఆఖరికి మరణించాడు. తల్లిదండ్రులు అతన్ని స్ట్రెచర్ పై మోసుకుంటూ ఆసుపత్రి మొత్తం తిరగాల్సి వచ్చింది. ఆ ప్రభుత్వ ఆసుపత్రికి కాకుండా.. వేరే ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే నా మిత్రుడు బతికుండేవాడు. ప్రభుత్వాసుపత్రులు మరణాలకు, నిర్లక్యధోరణికి పర్యాయపదం కాదు అని చెప్పడానికి ఏం చేయమంటారు సార్" అని నాగ్ఆశ్విన్ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. "నా మిత్రుడు ఈ రాష్ట్రంలోనే ప్రముఖ కెమెరామెన్. ఈ ఘటన గురించి ఎవర్ని ఏ విధంగా ప్రశ్నించాలో అర్థం కావడంలేదు సర్. అవసరమైన సమయంలో వైద్య సదుపాయం అందక ఎవ్వరూ చనిపోకూడదు’ అని పోస్ట్‌లో తెలిపారు అశ్విన్. ఈ విషయంపై కేటీఆర్ స్పందించాల్సి ఉంది.
what can we do @KTRTRS sir to make sure that the word 'government hospital' need not be synonymous with carelessness and death. my friend was easily one of the best cameramen we have in the state. i don't know whom else to ask sir. nobody should die needlessly
— Nag Ashwin (@nagashwin7) November 27, 2018