తెలంగాణ రాష్ట్ర మంత్రులుగా 10 మంది ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేసీఆర్ ప్రతిపాదించిన అభ్యర్ధుల చేత గవర్నర్ నరసింహన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎవరికి ఎలాంటి శాఖలు కేటాయిస్తారనే దానిపై చర్చ నడుస్తోంది. పార్టీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఆయా మంత్రులకు ఈ క్రింది శాఖలు కేటాయిస్తారని తెలిసింది.
ఎర్రబెల్లి దయాకర్ - వ్యవసాయశాఖ
ఈటల రాజేందర్ - సంక్షేమ శాఖ
ఇంద్రకరణ్ రెడ్డి - వైద్య ఆరోగ్య శాఖ
మల్లారెడ్డి - విద్యుత్ శాఖ
నిరంజన్ రెడ్డి - ఆర్ధిక శాఖ
శ్రీనివాస్ గౌడ్ - మున్సిపల్ ఎక్సైజ్ శాఖ
తలసాని - పౌరసరఫరాల శాఖ
కొప్పుల ఈశ్వర్ - విద్యాశాఖ
ప్రశాంత్ రెడ్డి - పరిశ్రమల శాఖ
జగదీష్ రెడ్డి - రహదారులు, రోడ్లు భవనాల శాఖ
కాగా శాఖల కేటాయింపుపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. సాయంత్రం లోపు ఏ మంత్రికి ఏ శాఖ కేటాయించారనే దానిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.