Job Notification: ల్యాబ్‌ టెక్నీషియన్‌ జాబ్‌ నోటిఫికేషన్‌.. అర్హత, జీతం పూర్తి వివరాలు తెలుసుకోండి..

TG Lab Technician Job Notification:  తెలంగాణలో మరో జాబ్‌ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్‌, హెల్త్‌ డిపార్ట్‌మెంట్లలో ఉన్న ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు అని సెక్రటరీ బోర్డు సభ్యుడు గోపికాంత్ రెడ్డి చెప్పారు.

Written by - Renuka Godugu | Last Updated : Sep 13, 2024, 06:51 AM IST
Job Notification: ల్యాబ్‌ టెక్నీషియన్‌ జాబ్‌ నోటిఫికేషన్‌.. అర్హత, జీతం పూర్తి వివరాలు తెలుసుకోండి..

TG Lab Technician Job Notification: మెడికల్‌ హెల్త్‌ సర్వీస్‌ రిక్రూట్మెంట్‌ బోర్డు (MHSRB) భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు దరఖాస్తు స్వీకరిస్తోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1,284 ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌ 2 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.

తెలంగాణలో మరో జాబ్‌ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్‌, హెల్త్‌ డిపార్ట్‌మెంట్లలో ఉన్న ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు అని సెక్రటరీ బోర్డు సభ్యుడు గోపికాంత్ రెడ్డి చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు ఈ నెల అంటే సెప్టెంబర్‌ 21 నుంచి దరఖాస్తు చేసుకోవాలి. ఈ జాబ్‌ నోటిఫికేషన్‌కు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్‌ 5. అప్లికేషన్‌లో ఏవైనా మార్పులు చేసుకోవాలంటే అక్టోబర్‌ 5 నుంచి 7 వరకు చేసుకోవచ్చన్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ పరీక్ష నవంబర్‌ 10న నిర్వహించనున్నారు. 

అయితే, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 46 ఏళ్లలోపు ఉండాలి. దరఖాస్తుదారుల సంఖ్య పెరిగితే రెండు మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఎగ్జామ్‌ పేపర్‌ ఇంగ్లిష్‌ మాధ్యమంలో ఉంటుంది.ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1284 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో 1,088 డైరెక్టర్‌ ఆఫ్ పబ్లిక్‌ హెల్త్‌, డెరెక్టర్‌ ఆఫ్ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (DME) డిపార్ట్‌మెంట్‌, మరో 183 తెలంగాణ వైద్య విధాన పరిషద్‌ ఆసుపత్రులు, 13 పోస్టులు హైదరాబాద్ ఎంజేజే హాస్పిటల్‌. ఎంపికైన అభ్యర్థులకు రూ. 32,810 నుంచి రూ.96,890 డైరెక్టర్‌ ఆఫ్ పబ్లిక్‌ హెల్త్‌, డెరెక్టర్‌ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌ పోస్టులకు అందించనున్నారు. ఇక ఎంజేజే హాస్పిటల్‌ పోస్టులకు రూ.31,040-రూ.92,050.

ఇదీ చదవండి: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వరుసగా 3 రోజులపాటు అన్నీ స్కూళ్లు, కాలేజీలకు సెలవు..!

రాష్ట్రవ్యాప్తంగా 13 పరీక్ష కేంద్రాల్లో ఈ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌, నల్గొండ, కోదాడా, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌, నర్సంపేట జిల్లాల్లో నిర్వహిస్తారు. ఈ పోస్టులకు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రూ.500 పరీక్ష ఫీజు, రూ.200 ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ పరీక్షలో పాసైన అభ్యర్థుల మెరిట్‌ లిస్ట్‌ జాబితాను బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

ఇదీ చదవండి:  కమ్యూనిస్ట్‌ పార్టీలో తీవ్ర విషాదం.. సీతారాం ఏచూరి కన్నుమూత..!

కావాల్సిన డాక్యుమెంట్లు..
అర్హత వివరాలు బోర్డు సైట్‌లో క్షుణ్నంగా చదువుకోవాలి.
ఆధార్‌ కార్డు, పదో తరగతి పాసైన సర్టిఫికేట్‌, మెమో, సంబంధిత అర్హత పరీక్ష సర్టిఫికేట్‌
మెడికల్‌ బోర్డు జారీ చేసిన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌
అనుభవం ధృవపత్రం
1 నుంచి 7 తరగతి వరకు లోకల్‌ స్టేటస్‌ స్డడీ సర్టిఫికేట్‌
కమ్యూనిటీ సర్టిఫికేట్‌, నాన్‌ క్రిమీలేయర్‌ సర్టిఫికేట్‌ లేటెస్ట్‌, తాజా ఆదాయ ధృవపత్రం కలిగి ఉండాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News