DGP Jitender Reddy: హీరో అయితే మాకేంటీ..?.. అల్లు అర్జున్‌పై మండి పడిన డీజీపీ.. ఏమన్నారంటే..?

Pushpa 2 movie stampede: పుష్ప2 మూవీ ప్రీమియర్ షో నేపథ్యంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై తెలంగాణ డీజీపీ స్పందించారు. తమకు అందరు ఒకటే అని స్పష్టం చేశారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 22, 2024, 03:28 PM IST
  • తొక్కిసలాటపై మాట్లాడిన డీజీపీ..
  • ప్రజల భద్రత ముఖ్యమంటూ వ్యాఖ్యలు..
DGP Jitender Reddy: హీరో అయితే మాకేంటీ..?.. అల్లు అర్జున్‌పై మండి పడిన డీజీపీ.. ఏమన్నారంటే..?

Dgp Jitender reddy fires on allu arjun incident: పుష్ప2 మూవీ రిలీజ్ నేపథ్యంలో జరిగిన తొక్కిసలాట ఘటన  ప్రస్తుతం పెనుదుమారంగా మారింది. ఈ ఘటనపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ ను ఏకీపారేశారు. ఆయన రావడం, కారు నుంచి లేచి అభివాదం చేయడం వల్ల.. రోడ్ షో వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. అదే విధంగా.. రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్ చావు, బతుకుల మధ్యలో ఉన్నాడు.

అలాంటి సమయంలో.. ఒక్కరైన వెళ్లి వాళ్ల కుటుంబాన్ని పరామర్శించారా.. అని ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ కు కాలు విరిగిందా.. చేతులు విరిగాయా.. కిడ్నీలు పాడైయ్యాయా.. అంటూ ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం  అల్లు అర్జున్ కూడా.. రాత్రి మీడియా సమావేశం నిర్వహించి.. రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తొంది.

తాను.. రోడ్ షో నిర్వహించలేదని.. తనను ఏ పోలీసులు కలవలేదని స్పష్టం చేశారు. తన క్యారెక్టర్ ను పూర్తిగా తప్పుగా ఎలివేట్ చేస్తున్నారన్నారు. అయితే.. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయంగాను.. ఇండస్ట్రీ పరంగాను కూడా కాక రేపుతుందని చెప్పుకొవచ్చు.

తాజాగా.. ఈ ఘటనపై తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి స్పందించారు. తమకు అందరు  ఒక్కటేనని స్పష్టం చేశారు. కరీంనగర్ లోని కొత్త పల్లిలో భరోసా కేంద్రాన్ని డీజీపీ ప్రారంభిచారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఘటనపై మాట్లాడినట్లు తెలుస్తొంది. అల్లు అర్జున్ కి తామేం వ్యతిరేకత కాదని స్పష్టం చేశారు. చట్టప్రకారం తాము.. యాక్షన్ తీసుకున్నట్లు తెలిపారు. ఆరోజు  జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు.

Read more: Allu Arjun: ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. ప్రెస్ మీట్‌లో చిరు, పవన్ పేర్లు తీసుకొవడం వెనుక బన్నీ ప్లాన్ అదేనా..?

పౌరుల భద్రత, వారి సెఫ్టీ తమ ప్రథమ ప్రయారిటీ అన్నారు. సినిమా ప్రమోషన్ లు పౌరుల భద్రత కంటే.. ముఖ్యం కాదని కూడా జితేందర్ రెడ్డి మాట్లాడినట్లు తెలుస్తొంది. మోహన్ బాబు వ్యవహారంలో కూడా చట్టం తనపని తాను చేసుకుని వెళ్తుందని డీజీపీ అన్నారు. మరొవైపు నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీడియాపై ప్రస్తుతం రాజకీయంగా దుమారంగా మారింది. బీజేపీ నేతలు , బీఆర్ఎస్ పార్టీలు అల్లు అర్జున్ కు మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News