Bandi Sanjay On CM KCR: బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై దాటి ఘటనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. టీఆర్ఎస్ గుండాలు పోలీస్ సహకారంతో దాడి చేశారని ఆరోపించారు. దాడి ఎందుకు చేశారో అర్థం కావడం లేదని.. దాడి జరిగిన సమయంలో డీఎస్ ఇంట్లో లేకపోవడం అదృష్టమన్నారు. భయంతోనే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంటిపై దాడి చేసినందుకు బాధలేదని.. దర్గాదేవి, తులసి మాతపై దాడి చేయడం బాధగా ఉందన్నారు.
దాడి మా పార్టీ వాళ్ళు చేసినా తప్పే.
దాడి ఎవరు చేసినా తప్పేనని.. ఇంటిపై తమ పార్టీ వాళ్లు దాడి చేసినా తాను సహించనని అన్నారు బండి సంజయ్. రాజకీయాల కోసం కేసీఆర్ తన సొంత బిడ్డనే పావుగా వాడుకుంటున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబాన్ని పొలిమేర వరకు తరిమేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ దాడి ఘటనపై అమిత్ షా ఆరా తీశారని.. అరవింద్ కి కాల్ చేసి భరోసా కల్పించారని బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్ ఏం చేస్తున్నాడో ఆయనే రెండు గట్టి పెగ్గులేసి ఆలోచించుకోవాలని హితవు పలికారు. ఆట తామే మొదలు పెట్టామని.. ఎండింగ్ కూడా తామే చూపిస్తామన్నారు. కేసీఆర్ న్యూసెన్స్ క్రియేట్ చేశారని.. తమ ఎండింగ్ భయంకరంగా ఉంటుందని హెచ్చరించారు. తమకు జైళ్లు, కేసులు, దాడులు కొత్త కాదన్నారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి మాట్లాడుతూ.. ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి జరగడం దురదృష్టకరం అని అన్నారు. కేసీఆర్ బుద్ది వంకర బుద్ది అని.. ఆయన బిడ్డలకైనా మంచి బుద్ది ఇచ్చి ఉంటే బాగుండని అన్నారు. కవిత వీధి రౌడీల్లాగా మాట్లాడుతోందని.. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. ఇలాంటి దాడులు చూస్తూ సహించమని.. ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు విమర్శలు చేస్తే వాటికి సమాధానం చెప్పాలి కానీ దాడులు చేయడం ఏంటి..? అని ప్రశ్నించారు.
Also Read: Team India: ఒకే ఏడాదిలో 8 మంది కెప్టెన్లు.. కేఎల్ రాహుల్ ఫ్లాప్ షో.. సెలక్టర్లు ఇలా చేసినందుకే..
Also Read: Rohit Sharma: రోహిత్ శర్మపై వేటు.. బీసీసీఐ మరో సంచలన నిర్ణయం.. ఆ సిరీస్ తరువాత ప్రకటన..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook