Telangana Elections 2023: తెలంగాణలో చివరి 48 గంటల్లో ఏం జరగనుంది, ఫలితాలే మారిపోయే పరిస్థితి ఉందా

Telangana Elections 2023: తెలంగాణలో మరి కొద్దిగంటల్లో పోలింగ్ జరగనుంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరులో ఓటెవరికి అనేది ఓటరు తేల్చేయనున్నాడు. తెలంగాణలో ఇప్పటి వరకూ జరిగింది ఓ ఎత్తైతే చివరి 48 గంటలు అత్యంత కీలకం కానున్నాయని తెలుస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 28, 2023, 11:10 AM IST
Telangana Elections 2023: తెలంగాణలో చివరి 48 గంటల్లో ఏం జరగనుంది, ఫలితాలే మారిపోయే పరిస్థితి ఉందా

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడింది. ఇవాళ్టితో ప్రచారం ముగియనుండటంతో ఇక అంతా ఎలక్షనీరింగ్ ఒక్కటే మిగిలింది. ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకం ఇదే. ఓటరును ప్రసన్నం చేసుకోవడం ఇప్పటి వరకూ జరిగిన ప్రక్రియ అయితే ఆ ఓటర్‌ను పోలింగ్ బూత్ వరకూ తీసుకురావడం మరో కీలకమైన ప్రక్రియ. ఇప్పుడు మిగిలిన 48 గంటల్లో జరగాల్సింది ఇదే. అందుకే ఈ చివరి 48 గంటలు ఎన్నికల ఫలితాల్నే మార్చేయవచ్చు కూడా.

ఏ ఎన్నికల్లో అయినా అత్యంత కీలకమైన దశ ఏ పార్టీకైనా సరే ఎలక్షనీరింగ్. ప్రచారంలో ముందు వరుసలో ఉన్నా..ఎన్ని హామీలతో ఆకట్టుకున్నా..ఎలక్షనీరింగ్‌లో విఫలమైతే లాభం ఉండదంటారు. ఏ పార్టీ ఎంతమంది ఓటర్లను సమర్ధవంతంగా పోలింగ్ బూత్ వరకూ తీసుకెళ్లగలుగుతుందో ఆ పార్టీకే విజయం వరిస్తుంది. దీనినే ఎలక్షనీరింగ్‌గా అభివర్ణిస్తుంటారు.  ఈ ఎలక్షనీరింగ్‌లో కుల, మత, వర్గపరమైన ఓటింగ్ కీలకం కానుంది. ధనం మూలం ఇదం జగత్ అన్నట్టు ఎలక్షనీరింగ్‌లో ప్రధాన భూమిక పోషించేది డబ్బు. అన్ని పార్టీలు డబ్బులు పంచిపెట్టేవే . కానీ ఏ పార్టీ డబ్బులు చివరి ఓటర్ వరకూ వెళ్తాయనేది ముఖ్యం. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకే చివరి 48 గంటల్లో అన్ని పార్టీలు ఎలక్షనీరింగ్‌పైనే దృష్టి సారిస్తుంటాయి. 

తెలంగాణ ఎన్నికల్లో ఇప్పటి వరకూ మెజార్టీ సర్వేలు కాంగ్రెస్ పార్టీకు అనుకూలంగా ఫలితాలు వెల్లడించాయి. అధికార బీఆర్ఎస్ మాత్రం ఈ సర్వేల్ని పట్టించుకోకుండా మూడోసారి అధికారం తమదేనంటున్నాయి. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న ప్రచారం ఓట్లుగా మార్చగలుగుతుందా లేదా అనేది కాంగ్రెస్ నేతల సామర్ధ్యంపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో అధికార పార్టీకు అనుకూలంగా ఉండవచ్చు. ఎలక్షనీరింగ్‌లో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ రెండాకులు ఎక్కువే చదివింది. అందుకే చివరి 48 గంటలు గేమ్ ఛేంజ్ అవుతుందనే నమ్మకంలో ఆ పార్టీ ఉంది. 

అదే సమయంలో గత వారం రోజుల్నించి ముఖ్యంగా మోదీ, అమిత్ షాల ప్రచారంతో బీజేపీకు కాస్త ఊపు వచ్చినట్టు కన్పిస్తోంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ ముఖ్యమంత్రి నినాదం నేపధ్యంలో ఆ పార్టీకు లాభించవచ్చని తెలుస్తోంది. అయితే ఈ అంశాలు ఆ పార్టీను విజయం వరకూ నడిపించవు గానీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడంలో ఉపయోగపడతాయి. ఫలితంగా బీఆర్ఎస్ లాభపడవచ్చు. బీజేపీ ఎన్ని ఓట్లను చీల్చగలిగితే బీఆర్ఎస్ పార్టీకు అంత లాభం, కాంగ్రెస్ పార్టీకు అంత నష్టం ఉండనుంది. అందుకే చివరి 48 గంటల్లో ఫలితం మారిపోయినా ఆశ్చర్యం లేదు. 

Also read: Telangana Election 2023: ఇవాళ్టితో ప్రచారం పరిసమాప్తం, చివరిరోజు హోరెత్తనున్న రోడ్ షోలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News