TSRTC Diesel Cess: ప్యాసింజర్ సెస్ పేరుతో ఇప్పటికే ప్రయాణికులకు షాకిచ్చిన టీఎస్ఆర్టీసీ.. వారం రోజులు గడిచిందో లేదో మరో షాకిచ్చింది. ఇక నుంచి టికెట్ చార్జీలపై డీజిల్ సెస్‌ను కూడా విధించనున్నట్లు తెలిపింది. పెరుగుతున్న చమురు ధరలు ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపుతున్నందునా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని వెల్లడించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ టికెట్ చార్జీల పెంపు వివరాలను వెల్లడించారు.
పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసులలో డీజిల్ సెస్ కింద టికెట్‌పై రూ.2.. ఎక్స్ ప్రెస్ , డీలక్స్ , సూపర్ లగ్జరీ , సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ , మెట్రో డీలక్స్ , ఏసీ సర్వీసులలో టికెట్‌పై రూ .5 చొప్పున పెరగనున్నట్లు సజ్జనార్ తెలిపారు. శనివారం (ఏప్రిల్ 9) నుంచే డీజిల్ సెస్ అమలులోకి వస్తుందన్నారు. పల్లె వెలుగు , సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో కనీస చార్జీ రూ .10 కొనసాగుతుందని స్పష్టం చేశారు. తాజా నిర్ణయం ఆర్టీసీ సంస్థకు కొంత ఉపసమనం కలిగించడంతో పాటు ప్రయాణికులకు మరింత మెరుగైన ప్రజా రవాణా సేవల్ని కొనసాగించడానికి దోహదపడుతుందన్నారు.
రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత డీజిల్ ధరలు పెరగడంతో టీఎస్ఆర్టీసీపై ఆర్థిక భారం పడిందని సజ్జనార్ పేర్కొన్నారు. రోజు వారీ ఖర్చులు పెరిగిపోతుండటంతో సంస్థ నష్టాల్ని చవిచూడాల్సి వస్తోందన్నారు. ఈ క్రమంలో పెరిగిపోతున్న డీజిల్ ధరల వల్ల టిఎస్ఆర్టీసీపై ఆర్థిక భారం పడుతోందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రతీరోజూ 6 లక్షల లీటర్ల హెచ్ఎస్డి ఆయిల్‌ను వినియోగిస్తున్నారని... ఇటీవలి కాలంలో అసాధారణ రీతిలో చమురు ధరలు పెరగడంతో హెచ్ఎస్డి ఆయిల్ ధర కూడా పెరిగిందన్నారు. 2021 డిసెంబర్లో రూ.85 గా ఉన్న హెచ్ఎస్డి ఆయిల్ ధర ఇప్పుడు రూ.118కి చేరిందన్నారు. ఈ కారణంతోనే టికెట్ చార్జీలు పెంచడం అనివార్యమైందన్నారు. గతంలో కష్ట సమాయాల్లో ఆర్టీసీ సంస్థను ఆదరించిన ప్రయాణీకులు ఇప్పుడు కూడా సంస్థను ఆదరించాలని కోరారు.
Also Read: Yuzvendra Chahal: ఆ క్రికెటర్ ఫుల్‌గా తాగి.. 15వ అంతస్థు నుంచి నన్ను తోసేయబోయాడు: చహల్
PBKS vs GT: పంజాబ్‌దే బ్యాటింగ్.. బెయిర్‌స్టో వచ్చేశాడు! తుది జట్లు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook