Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. నాలుగు రోజులే పనిదినాలు, 3 రోజులు ఆఫ్‌?

Govt Employees Jackpot Likely To Introduce Weekly Four Days: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే వార్త. ఉద్యోగులపై పని ఒత్తిడి పెరుగుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నదని తెలుస్తోంది. ఉద్యోగుల సేవల్లో సంస్కరణలు తీసుకువస్తున్న ప్రభుత్వాలు తాజాగా వారి పని గంటలు పెంచి.. పని రోజులు తగ్గించేందుకు చూస్తున్నట్లు హాట్ టాపిక్‌గా మారింది.

1 /6

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న వార్షిక బడ్జెట్‌పై సాధారణ ప్రజలతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా భారీ ఆశల్లో ఉన్నారు. తమకు ఏం లబ్ధి చేకూరుతుందా? అంటూ లెక్కలు వేస్తున్నారు.

2 /6

ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించబోతున్నట్లు చర్చ జరుగుతోంది. కేంద్ర బడ్జెట్‌లో కొత్త లేబర్‌ కోడ్‌ నిబంధనల అమలును ప్రకటించే అవకాశం ఉంది. లేబర్‌ కోడ్‌లను దశలవారీగా అమలుచేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

3 /6

కొత్త లేబర్‌ కోడ్‌లు మూడు దశల్లో అమల్లోకి రానున్నట్లు చర్చ జరుగుతోంది. వీటివలన పని గంటలు పెరగబోతున్నాయని.. పని రోజులు మాత్రం తగ్గనున్నాయని ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

4 /6

లేబర్‌ కోడ్‌ దశలు ఇవే: లేబర్‌ కోడ్‌ మొదటి దశలో 500 కంటే అధికంగా ఉద్యోగులు ఉన్న పెద్ద కంపెనీలు ఈ కోడ్‌లను అమలు చేయాల్సి ఉంది. రెండో దశలో 100-500 మంది ఉద్యోగులు ఉన్న మీడియం కంపెనీలను ఈ కోడ్‌ పరిధిలోకి తీసుకురానున్నారు. ఆఖరి దశ అంటే మూడో దశలో వంద మంది లోపు ఉద్యోగులు ఉన్న కంపెనీలపై ఈ కోడ్‌లను అమలు చేస్తారని చర్చ జరుగుతోంది.

5 /6

ఉద్యోగుల సమతుల్యత: కొత్త లేబర్‌ కోడ్‌లలో వారంలో నాలుగు రోజుల పని.. మూడు రోజుల విశ్రాంతి విధానం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉద్యోగుల పని.. జీవితం మధ్య సమతుల్యతను ఏర్పరచడమే లేబర్‌ కోడ్‌ల ప్రధాన ఉద్దేశంగా చర్చ నడుస్తోంది.

6 /6

నాలుగు రోజుల పనిదినంపై రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు చేస్తోందని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్‌లో ఈ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ విధానం అమలైతే ఉద్యోగులకు పని గంటలు పెరగడంతోపాటు పని రోజులు తగ్గనున్నాయి. ఉద్యోగులకు ఇది శాపంగా.. వరంగా మారనుంది.