Nita Ambani Visited Balkampet Temple: నీతా అంబానీ నిన్న రాత్రి 7:30 గంటల సమయంలో హైదరాబాద్ బల్కంపేట రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. నిన్న హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఉప్పల్ వేధికగా జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన ముఖేష్ అంబానీ సతీమణి అమ్మవారిని దర్శించుకున్నారు. ముంబై ఇండియన్స్ జెర్సీలో ఈ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నీతా అంబానీ ప్రతి ఏడాది బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకుంటారు. నిన్న ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ముంబై ఇండియన్స్ ఓనర్ గా కొనసాగుతున్నారు. ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా బుధవారం ఉప్పల్‌లో మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇలా నీతా అంబానీ బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకుంటే విజయం ఖాయమని ముంబై ఇండియన్స్ అభిమానుల నమ్మకం కూడా.
ఇదీ చదవండి: కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన.. రేవంత్ రెడ్డి వర్గానికే టికెట్లు
అయితే, బల్కంపేట ఆలయంలో నీతా అంబానీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రతి ఏడాది మ్యాచ్ నిర్వహించినప్పుడు హైదరాబాద్ వేధికగా నీతా అంబానీ బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఇలా చేస్తే విజయం సాధిస్తామని ఆమె నమ్మకం. ఒక రకంగా చెప్పాలంటే నిన్ని నీతా అంబానీ ఆలయాన్ని దర్శించుకుంది ఇక విజయం కూడా ముంబై ఇండియన్స్‌దేనని ముంబై జట్టు అభిమానులు కామెంట్లు కూడా పెట్టారు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠత మధ్య జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె మ్యాచ్ మధ్యలోనే బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్నారు. ఆ మ్యాచ్ కేవలం ఒక్క రన్ తేడాతో ముంబై ఇండియన్స్ అనూహ్య విజయం సాధించింది. ఇది బల్కంపేట రేణుక ఎల్లమ్మ ప్రత్యేక ఆశీర్వాదమే కారణమని అప్పటి నుంచి నమ్మడం ప్రారంభమైంది.
ఇదీ చదవండి: దమ్ముంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి: కేటీఆర్ సంచలన సవాల్
ఇక హైదరాబాద్‌లో ఉన్న బల్కంపేట రేణుక ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారు స్వయంగా వెలిశారని నమ్ముతారు. కలియుగ దైవంగా ఎల్లమ్మ తల్లిని పూజిస్తారు. ఈ ఆలయాన్ని సందర్శిస్తే సర్వరోగాలు నయమవుతాయనే నమ్మకం ఉంది. ఎన్నో దశాబ్దాలుగా ఈ ఆలయం వెలుగొందుతోంది. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం గురించి ఎన్నో కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అంతేకాదు ఈమె పరశురాముని తల్లిగా కొలుస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook