Minister Seethakka Fires On Kishan Reddy: గత పదేండ్లలో మూసీ ప్రక్షాళన కోసం గానీ,మూసీ ప్రాంత ప్రజల సంక్షేమం, ఉపాధి కోసం గానీ నయా పైసా కేటాయించని కేంద్ర ప్రభుత్వం ఎదుట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ నేతలు మొదట ధర్నాలు చేయాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. సొంత నియోజకవర్గం గుండా మూసీ పారుతున్నా.. ఏనాడు కేంద్రం నుంచి నిధులు తీసుకురాని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇప్పుడు మూసీ ప్రాంత ప్రజల తరుఫున ధర్నాకు పిలువునివ్వడం ఎందుకని ప్రశ్నించారు. మూసీ ప్రాంత ప్రజల పక్షాన ఈ నెల 25న ఇందిరా పార్క్ వద్ద బీజేపీ తలపెట్టిన ధర్నాను విరమించుకోవాలన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో ముగ్గురు బీజేపీ ఎంపీలు, ఒక కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నందున కేంద్రంతో చర్చించి హైదరాబాద్ జీవన రేఖగా భావించే మూసి పునరుజ్జీవనం కోసం రూ.10 వేల కోట్లను మంజురు చేయించాలని డిమాండ్ చేశారు.
రెండేల్ల క్రితం వరదల్లో మూసీ ప్రాంత ప్రజలు నష్టపోయినప్పుడు బండికి బండి ఇస్తామని, ప్రతి ఇంటికి నష్టపరిహారం అందిస్తామని హమీ ఇచ్చిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఒక్కరిని కూడా ఆదుకోలేదని మంత్రి సీతక్క గుర్తు చేశారు. ఇప్పుడు మూసీ ప్రాంత అభివృద్దిని అడ్డుకుంటూ బీజేపీ తన నైజాన్ని బయటపెట్టుకుంటుందని ఆరోపించారు. గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును సమర్దిస్తున్న బీజేపీ ఇక్కడ మూసీ అభివృద్ది ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకిస్తుందని సీతక్క ప్రశ్నించారు.
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు సక్సెస్ అయ్యి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగి ఎక్కడ ఇతర నగరాలను దాటిపోతుందో అనే భయం బీజేపీ నేతలను వేంటాడుతుందని అందుకే మూసి యజ్ఞంను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగా మూసీ ప్రాంత ప్రజల పట్ల ప్రేమ ఉంటే గత పదేండ్లలో ఎందుకు వారిని పట్టించుకోలేదని ప్రశ్నించారు. మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఎక్కడా బలవంతపు తరలింపులు లేవని, ప్రజల సమ్మతితోనే వారికి మరో చోట స్థిర నివాసం, ఉపాధి కల్పించిన తర్వాతే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అయినా మూసీ పునరుజ్జీవన వంటి మంచి కార్యక్రమాన్ని అడ్డుకోవడం ఎందుకని ప్రశ్నించారు.
గత పదేండ్లలో మూసీ కోసం ఒక్క పైసా కేటాయించలేదని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పార్లమెంటులోనే ప్రకటించినప్పుడు బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు..? యూపీఏ హాయంలో మూసీ ప్రక్షాళన కోసం 335 కోట్లు మంజూరు అయితే మోదీ పాలనలో పైసా మంజూరు కాకపోయినా ఎందుకు మీరు పెదవి విప్పలేదు..? అని సీతక్క ప్రశ్నించారు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోని గంగా ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం రూ.11 వేల కోట్లు ఖర్చు చేసిందని ఇతర నదుల ప్రక్షాళన కోసం 6 వేల కోట్ల మంజూరు చేసిందన్నారు. కానీ మూసీ ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం పైసా కేటాయించకపోవడం తెలంగాణపై కేంద్రం వివక్షతకు నిదర్శనం కాదా..? ఆ వివక్షతను మీరెందుకు ప్రశ్నించలేదు..? కిషన్ రెడ్డిపై సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు మానుకుని సొంత నియోజకవర్గం గుండా పారుతున్న మూసీ అభివృద్ది కోసం పైసా తీసుకురాని కిషన్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిదని హితవు పలికారు.
Also Read: Diwali Deals: ఆ స్కూటీపై రూ. 25వేల డిస్కౌంట్..దివాళీ బంపర్ డిస్కౌంట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter