హైదరాబాద్ : తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు విధించిన లాక్డౌన్కు ప్రజలు చాలా సహకరించారు. లాక్ డౌన్ కి సహకరించిన వాళ్లందరికీ తాను మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను. అలాగే ఏప్రిల్ 30వ తేదీ వరకు కూడా ప్రజలు అదే స్పూర్తిని కొనసాగించాలని కోరుకుంటున్నట్టు కేసీఆర్ తెలిపారు. అప్పటివరకల్లా పరిస్థితులు చక్కబడి, వైరస్ ప్రభావం తగ్గితే.. ఏప్రిల్ 30 తర్వాత దశల వారిగా లాక్డౌన్ను ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. శనివారం సాయంత్రం ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ముందునుంచి చెబుతూ వస్తున్నట్టుగానే శనివారం ఉదయం దాదాపు మూడు గంటలకు పైగా ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లోనూ తాను ప్రధాని మోదీకి కూడా ఇదే విషయాన్ని చెప్పానని అన్నారు. దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ కొనసాగించాలని చాలా స్పష్టంగా చెప్పారని తెలిపారు.
Also read : Lockdown: అలా అయితే, పేదల ఖాతాల్లో రూ.5 వేలు జమ చేయండి: అసదుద్దీన్ ఒవైసి
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో శనివారం సాయంత్రం వరకు 503 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 96 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో రాష్ట్రంలో మరో 14మంది మృతి చెందగా రాష్ట్రవ్యాప్తంగా 393 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని.. వాళ్లందరికీ చికిత్స అందిస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. లాక్ డౌన్ విషయంలో జనానికి ఉన్న సందేహాలను సీఎం కేసీఆర్ ఈ విధంగా క్లియర్ చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..