KTR: కేటీఆర్ విచారణకు వస్తారా.. లేదా..?

KTR: ఫార్ములా-ఈ కారు రేసు కేసుకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ ఏసీబీ  ఈ రోజు మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించనుంది. నేటి ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ అధికారులు  కేటీఆర్‌కు నోటీసులు జారీ చేశారు. మరి కేటీఆర్ ఈ విచారణకు హాజరవుతారా ? లేదా అనేది తెలంగాణ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 6, 2025, 09:25 AM IST
KTR: కేటీఆర్ విచారణకు వస్తారా.. లేదా..?

KTR: ఫార్ములా ఈ కారు రేసు కేసుకు సంబంధించిన న్యాయ నిపుణుల సూచన మేరకు ఈ కేసులో విచారణకు అటెంట్ అవుతానని  మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్‌  తెలిపారు. మరోవైపు తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయాలంటూ కేటీఆర్‌ హైకోర్టును ఆశ్ర యించిన సంగతి తెలిసిందే కదా. కాగా ఈ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. తీర్పు ప్రకటించే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని తెలిపింది. అయితే కేటీఆర్‌ పై  విచారణ కొనసాగించవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌ను విచారణకు రావాల్సిందిగా ఏసీబీ నోటీసులిచ్చింది.

ఈ నేపథ్యంలో సోమవారం జరగనున్న పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.  మరోవైపు ఇదే కేసులో ఈ నెల 7న విచారణకు రావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ - ఈడీ  కేటీఆర్‌కు సమన్లు జారీ చేసింది. అయితే ఇదే కేసులో సహ నిందితులుగా ఉన్న బీఎల్‌ఎన్‌ రెడ్డి, అరవిందకుమార్‌లనూ ఈ నెల 2, 3వ తేదిల్లోనే విచారణకు రావాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్  సమన్లు జారీ చేసింది. అయితే  వారిద్దరు ఈడీ విచారణకు కొంత సమయం కావాలని రాత పూర్వకంగా  కోరారు. దీంతో వారికి ఈడీ అధికారులు వారం రోజుల వ్యవధి ఇచ్చారు. కాగా  కేటీఆర్‌ సైతం వారి బాటలోనే మరికొంత సమయం అడుగుతారా లేదా అనేది వేచిచూడాలి.   

హైదరాబాద్‌లో ఫార్ములా–ఈ రేసు నిర్వహించిన యూకే (యునైడైడ్ కింగ్ డమ్) సంస్థ ఫార్ములా–ఈ ఆపరేషన్స్‌ లిమిటెడ్‌కు నిబంధనలకు విరుద్ధంగా, కేబినెట్‌ ఆమోదం లేకుండానే కేటీఆర్‌ ఆదేశాలతో అధికారులు పలు దఫాల్లో రూ. 54.88 కోట్లు చెల్లించారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై మునిసిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్‌ ఫిర్యాదుతో ఏసీబీ లాస్ట్ ఇయర్  డిసెంబర్‌ 19న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్‌ను ఏ–1గా, ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌ను ఏ–2గా, హెచ్‌ఎండీఏ మాజీ సీఈ బీఎల్‌ఎన్‌ రెడ్డిని ఏ–3గా చేర్చింది. ఇప్పటికే సేకరించిన పత్రాల ఆధారంగా కేటీఆర్‌ను ప్రశ్నించనుంది.

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News