Komatireddy Venkat Reddy: ఆయనొక శక్తి.. మీరు అణచలేరు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Komatireddy Venkat Reddy About Rahul Gandhi's Disqualification:  కేంద్రం రాహుల్ గాంధీపై ఎన్ని కుట్రలు చేసినా.. ప్రజలు అందరూ రాహుల్ గాంధీకే అండగా ఉంటారు. ఆయనపై అనర్హత వేటు వేయడం అంటే రాజ్యాంగాన్ని, అధికారాన్ని దుర్వినియోగపరచడమే అవుతుంది. ఇది ముమ్మాటికీ నరేంద్ర మోదీ సర్కారు తొందరపాటు చర్యే అవుతుంది అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 25, 2023, 08:18 AM IST
Komatireddy Venkat Reddy: ఆయనొక శక్తి.. మీరు అణచలేరు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Komatireddy Venkat Reddy About Rahul Gandhi's Disqualification: ప్రజాస్వామ్యం చరిత్రలోనే ఈరోజు ఒక బ్లాక్ డే అని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం అనేది భారతీయ జనతా పార్టీ చేసిన కుట్ర అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ ఇమేజ్ గతంలోకంటే మరింత పెరిగింది. భారత్ జోడో యాత్రలో దేశవ్యాప్తంగా తిరిగి ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ ఎక్కడికక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వచ్చారు. అందుకే రాహుల్ గాంధీపై బీజేపి కుట్రలకు పాల్పడుతోందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. 

కేంద్రం రాహుల్ గాంధీపై ఎన్ని కుట్రలు చేసినా.. ప్రజలు అందరూ రాహుల్ గాంధీకే అండగా ఉంటారు. ఆయనపై అనర్హత వేటు వేయడం అంటే రాజ్యాంగాన్ని, అధికారాన్ని దుర్వినియోగపరచడమే అవుతుంది. ఇది ముమ్మాటికీ నరేంద్ర మోదీ సర్కారు తొందరపాటు చర్యే అవుతుంది. కేంద్ర వైఫల్యాలను ప్రశ్నించినంత మాత్రాన్నే ప్రతిపక్షాలపై కుట్రలకు పాల్పడడం సబబు కాదు అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ సర్కారుకు హితవు పలికారు.  

గౌతం అదానీ వివాదాన్ని డైవర్ట్ చేసి ప్రజల దృష్టి మల్లించేందుకే రాహుల్ గాంధీపై అనర్హత వేటు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు అని బీజేపి వైఖరి చూస్తే అర్థమవుతోంది. ప్రతిపక్షాలను అణచివేయడం బీజేపీ వల్ల కాదు. కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్న రాహుల్ గాంధీ కేసులకు భయపడే వ్యక్తి కాదు.. ఆయనొక శక్తి అంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాహుల్ గాంధీకి అనుకూల వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు కుట్రను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోరాటం సాగించాల్సిన అవసరం ఉందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

 

ఇదిలావుంటే, తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాహుల్ గాంధీపై అనర్హత వేటు అంశాన్ని ఖండిస్తూ రోడ్డెక్కి నిరసన తెలిపారు. పలు చోట్ల బీజేపి నేతల దిష్టిబొమ్మలు దగ్దం  చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు చేపట్టారు. దీంతో అనేక చోట్ల రహదారులపై వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాబోయే రోజుల్లోనూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి : Revanth Reddy Slams PM Modi: రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు అసలు కారణం అదే..

ఇది కూడా చదవండి : CM KCR: రాహుల్ గాంధీపై అనర్హత వేటు.. చరిత్రలో నేడు చీకటి రోజు: సీఎం కేసీఆర్

ఇది కూడా చదవండి : LB Nagar RHS flyover Photos: గుడ్ న్యూస్.. సిటీలో అందుబాటులోకి ఎల్బీ నగర్ ఆర్‌హెచ్ఎస్ ఫ్లైఓవర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News