Jagga Reddy: బ్రాయిలర్ కోడి కేటీఆర్.. నాటుకోడి రేవంత్ రెడ్డి: జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Jagga Reddy Interesting Comments: దామగుండం రాడార్‌ స్టేషన్‌ అంశంపై కాంగ్రెస్‌ నాయకుడు జగ్గారెడ్డి రెచ్చిపోయి మాజీ మంత్రి కేటీఆర్‌పై రెచ్చిపోయి రాయలేని భాషలో అనుచిత వ్యాఖ్యలు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 22, 2024, 03:01 PM IST
Jagga Reddy: బ్రాయిలర్ కోడి కేటీఆర్.. నాటుకోడి రేవంత్ రెడ్డి: జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Telangana Politics: తిట్లలో రేవంత్‌ రెడ్డి వద్ద మాజీ మంత్రి కేటీఆర్‌ శిక్షణ తీసుకోవాలని.. కావాల్సి వస్తే తాను రేవంత్‌ సమయం అడుగుతానని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు తూర్పు జయప్రకాశ్‌ రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డి తెలిపారు. రేవంత్‌ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తూనే కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాయిలర్‌ కోడి కేటీఆర్‌ అని.. నాటుకోడి రేవంత్‌ రెడ్డి అని అభివర్ణించారు. దామగుండం రాడార్‌ స్టేషన్‌పై బీఆర్‌ఎస్‌ పార్టీ వ్యవహార శైలిని తప్పుబట్టారు.

Also Read: Ex Minister KTR: కొండా సురేఖకు కేటీఆర్ మరోసారి మాస్ వార్నింగ్.. వదిలిపెట్టేది లేదు

 

హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో మంగళవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను లక్ష్యంగా తీవ్రస్థాఇలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. తిట్టరాని తిట్లు తిట్టారు. 'నువ్వు రేవంత్ నీ తిడతవా? అతడిని గెల్కడం ఎందుకు? ఆయన తిడితే కేసులు పెట్టడం ఎందుకు?' అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ సోషల్ మీడియా.. దండుపాళ్యం గ్యాంగ్‌గా పోల్చారు. కేటీఆర్ నాలుకకు నరం లేదు.. బుర్రకి తెలివి లేకా జీఓ ఇచ్చావా? అని నిలదీశారు. 

Also Read: Telangana DAs: పెండింగ్‌లో ఉద్యోగుల ఐదు డీఏలు.. రేవంత్‌ సర్కార్‌కు ఆల్టిమేటం

 

'కేటీఆర్ బాయిలర్ కోడి వ్యవహారం.. మేము నాటు కోడి టైపు. నాజూకుగా పెరిగిన కేటీఆర్. రేవంత్ రెడ్డికి ఫుట్‌ఫాత్ నుంచి తెలుసు. నేను కూడా ఫుట్‌పాత్ నుంచి వచ్చిన వాళ్లమే' అని జగ్గారెడ్డి తెలిపారు. 'నీకు అవన్నీ తెలియకుండా పెంచాడు కేసీఆర్. కేటీఆర్ ఎలా తిట్టాలో ట్రైనింగ్ తీసుకో. రేవంత్ దగ్గరే శిక్షణ తీసుకో. రేవంత్‌కి చెప్తా అర గంట.. గంట సమయం ఇవ్వమని అడుగుతా' అని వివరించారు. 

'కేటీఆర్ మమ్మల్ని గెలకడం ఎందుకు. నువ్వు ఒకటి అంటే మేము వంద అంటాం. జాగ్రత్తగా వ్యవహరించి మాట్లాడు' అని జగ్గారెడ్డి చెప్పారు. రేవంత్‌ రెడ్డిని హౌలగాడు అంటూ కేటీఆర్ మాట్లాడడం నాకు బాధ అనిపించింది. కేటీఆర్‌కు అంతా బుక్ నాలెడ్జి తప్ప ప్రాక్టికల్ నాలెడ్జి లేదు' అని వివరించారు. కాంగ్రెస్ మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. పదేళ్లు రాజభోగాలు అనుభవించిన ఆయన.. ఇప్పుడు అవన్నీ దూరం అవ్వడంతో పిచ్చిలేసి మాట్లాడుతున్నారని విమర్శించారు.

'దమాక్ లేకనే కేటీఆర్‌ ఖతం అయ్యాడు. కర్ణాటక ఎన్నికల్లో కుమార స్వామికి కేటీఆర్‌ డబ్బులు పంపలేదా? కేజ్రీవాల్‌ను పంపింది నువ్వే కదా.. అందుకే మీ చెల్లెల్ని జైల్లో పెట్టింది కదా బీజేపీ. నవీన్ పట్నాయక్‌కి ఫండింగ్ చేయలేదా? నాలుగైదు రాష్ట్రాలకు డబ్బులు ఫండింగ్ చేసిన నువ్వు.. మాపై నిందలు వేయడం ఏంటి?' అని జగ్గారెడ్డి రెచ్చిపోయారు. 'కేసీఆర్ కొడుకు కేటీఆర్ చిన్న పిల్లాడిలా మాట్లాడుతుండడం బాధ కలుగుతోంది. రాజకీయ జ్ఞానం ఉందా లేదో అర్థం కావడం లేదు' అని తెలిపారు. రేవంత్‌ రెడ్డి ఏం మాట్లాడినా వక్రీకరించి మాట్లాడే పనిలో బావబామ్మర్ది ఉన్నారని విమర్శించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News