Hyderabad Development: అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి పుంతలు తొక్కబోతున్నది. ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పనులను కొనసాగించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్లైఓవర్లు, రోడ్లు, నాలాల నిర్మాణాలతోపాటు సుందరీకరణ పనులు వేగంగా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది.
Also Read: Power Charges: తెలంగాణలో పేదలకు ఊరట.. మిడిల్ క్లాస్‌కు 'కరెంట్' షాక్
అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీలో ప్రాజెక్ట్ భాగంగా చేపట్టిన ఫ్లై ఓవర్లు , నాలాల నిర్మాణాలపై సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్లో హైదరాబాద్ అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ అధికారులతోపాటు ఇతర సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు.. ఫ్లైఓవర్లు, రోడ్ల నిర్మాణంపై అధికారులు వివరించారు.
Also Read: Secretariat: సోషల్ మీడియాలో లైక్‌లు, పోస్టులు, కామెంట్లు చేయొద్దు.. పోలీసులకు ప్రభుత్వం వార్నింగ్
హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ నుంచి ప్రజల ఇబ్బందులను తగ్గించడానికి ఎస్ఆర్డీపీలో భాగంగా 48 ఫ్లేఓవర్లను గత ప్రభుత్వం ప్రారంభించిందని అధికారులు గుర్తుచేశారు. ఈ ఫ్లై ఓవర్ల ద్వారా ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీ చేయడానికి , సమయం.. ఇంధనం ఆదా చేయడానికి ఉపయోగపడుతోందని వివరించారు. ఎస్ఆర్డీపీ పనుల్లో భాగంగా జీహెచ్ఎంసీకి సంబంధించిన 42 పనులు కాగా 6 ఫ్లై ఓవర్లు ఆర్అండ్బీ,హెచ్ఎండీఏకి చెందినవి అందులో ఇప్పటికే 36 పనులు పూర్తయ్యాయని వెల్లడించారు.
అంబర్‌పేట ఫ్లైఓవర్, ఉప్పల్ - నారపల్లి ఫ్లైఓవర్లు నిర్మాణమవుతున్నాయని చెప్పగా.. పెండింగ్‌లో ఉన్న వాటిని వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆరాంఘర్ - జుపార్క్ మధ్య ఫ్లై ఓవర్ పనులు చివరి దశలో ఉండడంతో డిసెంబర్‌లోపు పూర్తి చేసి ప్రారంభించాలని చెప్పారు. రైల్వే శాఖ నిర్మిస్తున్న ఆర్వోబీ తదితర పనులపై కూడా చర్చ జరిగింది.
వచ్చే వర్షాకాలం సీజన్‌లోపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి అలా ఉండకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కొత్త ఫ్లైఓవర్లు, కొత్త నాలాలు అవసరమైన చోట ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. బడంగ్పేట్, జల్పల్లి, మీర్పేట్ తదితర ప్రాంతాలను కూడా సమన్వయం చేసుకొని పెండింగ్ పనులు పూర్తి చేయాలని తెలిపారు. రైన్ వాటర్ హార్వెస్టింగ్ 18 ప్రాంతాల్లో 23 సంపులు పనులు ఎంత వరకు వచ్చాయని ఆరా తీశారు. భవిష్యత్ తరాలకు నీటి వనరులు అందించే సామాజిక బాధ్యతను అందరూ పాటించాలని అధికారులు, ప్రజలకు మంత్రి చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook