AP Assembly 2025: అసెంబ్లీలో జగన్ స్కెచ్ అదిరిపోలే.. దెబ్బకు బాబు, పవన్ విల విల..

AP Assembly 2025: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీ వేదికగా వేసిన స్కెచ్ తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఏక కాలంలో షాక్ ఇచ్చాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 24, 2025, 12:25 PM IST
AP Assembly 2025: అసెంబ్లీలో జగన్ స్కెచ్ అదిరిపోలే.. దెబ్బకు బాబు, పవన్ విల విల..

AP Assembly 2025:  ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలో తనకు అపోజిషన్ లీడర్ గా గుర్తింపు ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పారు. లేకపోతే శాసనసభకు వచ్చేది లేదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే.. వరసగా ఆరు నెలలు శాసనసభకు రాకపోతే.. అనర్హత వేటు వేస్తామని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు .. జగన్ కు చెప్పారు. అందుకే జగన్ వ్యూహాత్మకం అసెంబ్లీకి వచ్చినట్టే వచ్చి .. గవర్నర్ ప్రసంగిస్తూ ఉండగనే నినాదాలు చేసి బాయ్ కాట్ అసెంబ్లీ అంటూ బయటకు వెళ్లిపోయారు. మళ్లా 60 రోజుల తర్వాత మొదటి రోజు వచ్చి రచ్చ చేసి వెళ్లిపోతారు. ఈ రకంగా అసెంబ్లీని బాయ్ కాట్ చేయాలన్నా.. తన ప్రతిజ్ఞ నెరవేరడంతో పాటు వరుసగా మొదటి  రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరై అనర్హత వేటు నుంచి తప్పించుకోవడమే ఇందులో వ్యూహంగా కనిపిస్తోంది.

ఒకవేళ ప్రభుత్వం జగన్ పై అనర్హత వేటు వేస్తే అక్కడ ఉప ఎన్నికలు రావడం.. మళ్లీ జగన్ గెలిచి  విజయ గర్వంతో అసెంబ్లీకి రావడం వంటివి జరుగుతాయి. ఒకవేళ జగన్ అసెంబ్లీకి రాకపోయినా.. ఆయన్ని అనర్హత వేటు వేసే సాహసం కూటమి ప్రభుత్వం చేయకపోవచ్చు.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

తనకు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా గుర్తింపు ఇస్తేనే శాసన సభకు వస్తానని చెప్పిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. తాజాగా జరగనున్న బడ్జెట్ సమావేశాలకు హాజరు కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తంగా రూల్స్ ప్రకారం కాసేటి క్రితమే అసెంబ్లీకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి.. వచ్చినట్టే వచ్చి ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తూ రచ్చ చేయడం.. ఆ తర్వాత బాయ్ కాట్ అంటూ అసెంబ్లీ నుంచి తన పార్టీ ఎమ్మెల్యేలతో వెళ్లిపోవడం వంటివి జగన్ ఓ వ్యూహాత్మకంగానే ఎత్తుగడగానే చెప్పాలి.

ప్రభుత్వాన్ని ప్రతిపక్ష హోదా అడిగినా.. రూల్స్ ప్రకారం ఇవ్వమని చెబుతుంది. ఆ విషయం జగన్ కు తెలిసినా.. తన దైన వ్యూహాత్మక ఎత్తుగడలతో ప్రభుత్వ ఎత్తులను చిత్తు చేయడంలో భాగంగా .. అసెంబ్లీకి వచ్చి 10 నుంచి 15 నిమిషాలు కంటిన్యూస్ గా నినాదాలు చేశారు. అది కూడా గవర్నర్ ప్రసంగం పూర్తి కాకుండానే.. కనీసం గవర్నర్ ప్రసంగం వినే ఓపిక లేకుండా..తనదైన పద్ధతిలో రచ్చ చేసి అసెంబ్లీని బాయ్ కాట్ చేసారు. అసెంబ్లీకి వచ్చినట్టే వచ్చి.. మరో 60 రోజల  వరకు మొఖం చూపించాల్సిన అవసరం లేదు.  ఇది కూటమి ప్రభుత్వం తనపై పన్నిన వ్యూహానికి  జగన్ అమలు చేసిన ప్రతి వ్యూహం అని చెప్పాలి. 

ప్రతిపక్ష హోదా ఇవ్వరనేది జగన్ కూడా తెలుసు.  కాకపోతే జగన్ కు  అంత ఓపిక లేదు. అంత తీరిక లేదు. అంత డెమోక్రటికల్ స్పిరిట్ లేదు.  ఫలితం ముందుగా నిర్ణయించకున్న ప్రకారం అసెంబ్లీని బాయికాట్ చేసేసి వెళ్ళిపోయారు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టే బాయ్ కాట్ చేసినట్టు వైసీపీ వాళ్లు చెప్పుకునేందుకు ఓ సాకు అని చెప్పాలి. మొత్తంగా జగన్ చేసిన ఈ పనికి షాక్ అవ్వడం బాబు, పవన్ ల వంతు అయిందనే చెప్పాలి. 

ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News