Aarogya Sri Scheme: ఏపీలో దాదాపు 20 ఏళ్లుగా అమల్లో ఉన్న ఆరోగ్య శ్రీ పథకం ఇకపై ఆగిపోనుంది. ఈ పధకం స్థానంలో ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆరోగ్య శ్రీతో ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుంది.
దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైన ఆరోగ్య శ్రీ పథకం చాలా ప్రాచుర్యం పొందింది. అందుకే ఇతర రాష్ట్రాలు కూడా ఈ పధకం ప్రారంభించాయి. ఏపీలో ఈ పధకం దాదాపు 20 ఏళ్లుగా అమల్లో ఉంది. ఏటా ప్రైవేట్ ఆసుపత్రులకు వందల కోట్లు చెల్లించడం భారంగా మారుతోందని 2024లో అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం భావించింది. అందుకే ఈ పథకాన్ని రద్దు చేసి ఆ స్థానంలో బీమా సౌకర్యం కల్పించాలని సూతప్రాయంగా నిర్ణయించింది. తద్వారా ప్రభుత్వంపై భారం తగ్గనుంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రత్యామ్నాయంగా బీమా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని బీమా సదుపాయం కల్పించే ఆలోచనను శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం సిద్దమైంది.
అయితే బీమా కంపెనీలు క్లెయిమ్స్ ఆలస్యం చేయకుండా ప్రభుత్వం తగిన జాగ్ర్తత్తలు తీసుకోనుందని తెలుస్తోంది. ఆ దిశగా ఇప్పటికే వివిధ బీమా కంపెనీలతో చర్చలు జరిపినట్టు సమాచారం. కేవలం ఆరు గంటల్లో క్లెయిమ్స్ విడుదలయ్యేలా సదరు బీమా కంపెనీలకు ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. దీనికోసం రాష్ట్రాన్ని రెండు యూనిట్లుగా విభజించనున్నారు. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఒక యూనిట్, గుంటూరు నుంచి ఇతర జిల్లాలకు రెండవ యూనిట్ ఉంటుంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద అందిస్తున్న ఏడాదికి 25 లక్షల పరిధిని ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆదాయంతో సంబంధం లేకుండా ఉంటుందా లేక ఆదాయం పరగణలో తీసుకుంటానే అనేది ఇంకా తేలలేదు. ఇంకా దీనిపై మార్గదర్శకాలు విడుదల కావల్సి ఉంది. అన్నీ అనుకూలిస్తే ఏప్రిల్ నుంచే ఉచిత బీమా పధకం అమలు కానుంది. ఆరోగ్య శ్రీ ఇక ఆగిపోనుంది.
Also read: Jio New Plan: 195 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో జియో హాట్‌స్టార్ ఉచితం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి