Rashmika Mandanna: నా మహారాజు.. నేను అతని మహారాణి: రష్మిక మందన్న

Rashmika Mandanna Viral Post : ప్రస్తుతం రష్మిక తెలుగు ఇండస్ట్రీలోనే కాదు హిందీ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఒకపక్క సినిమాలతోనే కాకుండా తన పర్సనల్ లైఫ్ ద్వారా కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తువుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో ఇప్పుడు రష్మిక షేర్ చేసిన ఒక ఫోటో అందరినీ ఆకట్టుకుంటుంది.

1 /5

పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

2 /5

ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళ్లింది. ‘పుష్ప’ మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని పాన్ ఇండియా స్టార్‌గా మారింది. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ పలు బిగ్ ప్రాజెక్ట్స్‌ చేస్తోంది.  

3 /5

తాజాగా రష్మిక నటించిన ‘ఛావా’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ సరసన నటించిన ఈ చిత్రం, ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఫిబ్రవరి 14న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.    

4 /5

ఈ నేపథ్యంలో రష్మిక చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విక్కీ కౌశల్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ "మహారాజు, మహారాణి" అనే క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలో రష్మిక అతన్ని పట్టుకొని నా మహారాజు అన్నట్టు ఫోజ్ ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంది.

5 /5

దీంతో నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. రష్మిక పేరు తరచుగా విజయ్ దేవరకొండతో వినిపిస్తూ ఉంటుంది. అయితే ఆమె ఈ పోస్ట్ పెట్టిన తర్వాత అభిమానుల నుంచి ఫన్నీ రియాక్షన్స్ వస్తున్నాయి. నీ మహారాజు విజయ్ కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక రష్మిక ప్రస్తుతం గర్ల్ ఫ్రెండ్ ప్రాజెక్ట్‌తో బిజీగా  బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో బిజీ అవుతున్న రష్మిక, ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యంత విజయవంతమైన హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది.