Weather Updates: కొనసాగనున్న తీవ్ర వడగాలులు.. మరోవైపు రాష్ట్రాన్ని తాకనున్న రుతుపవనాలు..

IMD Alert: తెలంగాణలో మరో రెండు రోజులపాటు ఎండలు దంచికొట్టనున్నాయి. అయితే తాజాగా రాష్ట్రప్రజలకు చల్లటి కబురు చెప్పింది హైదరాబాద్ వాతావరణ శాఖ. జూన్ 22కల్లా తెలంగాణను రుతుపవనాలు తాకే అవకాశం ఉంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 20, 2023, 11:21 AM IST
Weather Updates: కొనసాగనున్న తీవ్ర వడగాలులు.. మరోవైపు రాష్ట్రాన్ని తాకనున్న రుతుపవనాలు..

Telangana and AP weather Updates: రుతుపవనాల ఆలస్యం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. రానున్న రెండు రోజుల్లో మరింతగా ఎండలు మండిపోనున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో వేడి తీవ్రత మరింత పెరగనుంది. జనాలు బయటకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించంది.

ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురం భీం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, కరీంనగర్ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సోమవారం మెదక్, భద్రాచలం, రామగుండం, ఖమ్మం ప్రాంతాల్లో సాధారణం కన్నా 6  డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో గరిష్టంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. 

మరో రెండు రోజుల్లో తెలంగాణను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉన్నట్లు హైదరాబాదా వాతావరణ కేంద్రం తెలిపింది. జూన్ 10నే రుతుపవనాలను తెలంగాణలోకి ప్రవేశించాల్సి ఉండగా.. వాతావరణ పరిస్థితుల్లో మార్పు వల్ల లేట్ అయ్యాయి. ఈ నెల 22కల్లా తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈరోజు, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

మరోవైపు జూన్ 11 నుంచి కర్ణాటక-ఏపీ సరిహద్దుల్లో నిలిచిపోయిన రుతుపవనాల్లో కదలిక మెుదలైంది. ఏపీలోకి ప్రవేశించిన రుతుపవనాలు సోమవారం మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. మంగళవారం ఇంకొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో కూడా ఎండలు మండిపోతున్నాయి. కొన్ని చోట్ల 42 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మహిళలు, పిల్లలు, వృద్ధులు ఈ వేడికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వడదెబ్బకు చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. 

Also Read: Monsoon Effect: నైరుతి రుతుపవనాల పురోగమమనం, ఏపీలోని ఆ జిల్లాలకు వర్ష సూచన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News