Yamaha Rajdoot 350 New Model 2025: త్వరలోనే మార్కెట్లోకి రాజ్‌దూత్ 350 మోటర్ సైకిల్ విడుదల కాబోతున్నట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ బైక్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ కూడా ఇటీవలే లీక్ అయ్యాయి.
Yamaha Rajdoot 350 New Model 2025: గతంలో రాజ్‌దూత్ మోటార్‌సైకిల్ మంచి డిమాండ్ ఉండేది. నాటి సినిమాల్లో ఈ బైక్స్‌నే ఎక్కువగా వినియోగించేవారు. అప్పట్లోనే ప్రీమియం ఫీచర్స్‌తో ఈ కంపెనీ మోటర్‌సైకిల్స్ విడుదలయ్యేయి. అయితే త్వరలోనే రాజ్‌దూత్ నుంచి కొత్త కొత్త ఫీచర్స్‌తో మంచి బైక్ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మోటర్‌సైకిల్‌కి సంబంధించిన ఫోటోస్, ఫీచర్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
రాజ్‌దూత్ 350 మోటర్‌సైకిల్ అద్భుతమైన ఫీచర్స్‌తో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మోటర్ సైకిల్ అద్భుతమైన కొత్త ఫీచర్స్‌తో లాంచ్ అయ్యే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో ప్రత్యేకమైన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా అందిస్తోంది.
అలాగే ఈ రాజ్‌దూత్ 350 మోటర్‌సైకిల్‌లో మొబైల్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా డబుల్ డిస్క్ బ్రేకింగ్ సిస్టమన్ కూడా అందిస్తోంది. దీంతో పాటు ప్రీమియం ట్యూబ్‌లెస్ టైర్లను కూడా కలిగి ఉండబోతున్నట్లు సమాచారం.
కొత్త రాజ్‌దూత్ మోటార్‌సైకిల్ 349.86 cc ఇంజన్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే పవర్ఫుల్ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. ఊహాగానాల ప్రకారం ఈ మోటర్‌సైకిల్ ABS డ్యూయల్-ఛానల్‌తో రాబోతోంది. ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ని కూడా అందిస్తోంది.
అలాగే ఈ మోటర్‌సైకిల్‌కి సంబంధించిన మైలేజీ వివరాల్లోకి వెళితే.. ఇది లీటర్ పెట్రోల్‌కి 35 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించే ఛాన్స్ ఉంది. దీంతో పాటు ఈ బైక్ అనేక రకాల అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన వివరాలను కంపెనీ త్వరలోనే ప్రకటించనుంది.
ఇక ఈ రాజ్‌దూత్ 350 మోటర్‌సైకిల్ ధర వివరాల్లోకి వెళితే.. ఇది ఇటీవలే రాయల్ ఎనిఫిల్డ్ విడుదల చేసిన హంటర్ ధర కంటే చాలా తక్కువే ఉండే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించిన వివరాలు కూడా కంపెనీ త్వరలోనే వెల్లడించనుంది.