Battalion Constables: తెలంగాణలో కానిస్టేబుల్ భార్యలు, వారి కుటుంబసభ్యుల పోరాటం తీవ్ర వివాదం రేపిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బెటాలియన్ కానిస్టేబుళ్లు, వారి కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మూడు రోజులుగా ఉద్యమం చేపడుతున్నారు. జిల్లాల వారీగా చేపట్టిన ఉద్యమం శుక్రవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు పాకింది. ఏకంగా రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయాన్ని ముట్టడించారు. ఉద్యమం తీవ్రరూపం దాల్చడం.. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోజురోజుకు ఈ వివాదం తీవ్ర రూపం దాల్చుతుండడంతో వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించింది. భార్యల పోరాటానికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చింది. వారి డిమాండ్లకు అంగీకరించింది.
Also Read: Congress: ఒక్కటవుతున్న 'ఒరిజినల్ కాంగ్రెస్'.. జీవన్ రెడ్డికి జగ్గారెడ్డి మద్దతు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బెటాలియన్ కానిస్టేబుళ్లకు సెలవులు రద్దు చేశారు. సెలవులు లేకుండా నిత్యం విధుల్లో అందుబాటుల్లో ఉండాలనే నిబంధన తీసుకురావడంతో కానిస్టేబుళ్లతోపాటు వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే బెటాలియన్‌లో కూలీలుగా పని చేయిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు సెలవులు కూడా రద్దు చేయడంతో వ్యక్తిగత పనులు, కుటుంబానికి సమయం ఇవ్వడం లేదు. ఇదే విషయమై కానిస్టేబుల్ సతీమణులు, వారి కుటుంబసభ్యులు మండిపడుతున్నారు.
Also Read: KTR: రోడ్డు ప్రమాదం చూసి చలించిపోయిన కేటీఆర్.. స్వయంగా రంగంలోకి దిగి
సెలవు రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా కానిస్టేబుల్ కుటుంబసభ్యులు రోడ్లపైకి చేరుకున్నారు. రాష్ట్రంలోని అన్ని బెటాలియన్లలోని కానిస్టేబుల్ కుటుంబాలు ఉద్యమ బాట పట్టారు. పోలీసులు విధులకు.. బెటాలియన్ కానిస్టేబుళ్లు పని చేస్తున్న పనికి సంబంధం లేదని కానిస్టేబుల్ కుటుంబాలు వాపోయాయి. పండుగలతోపాటు అనారోగ్యం చెందితే ఆస్పత్రికి వెళ్లేందుకు కూడా సమయం లభించడం లేదని కానిస్టేబుల్ భార్యలు మండిపడ్డారు. ఈ నిర్ణయంపై సచివాలయాన్ని ముట్టడించడంతో ఎట్టకేలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగి వచ్చింది. బెటాలియన్ కానిస్టేబుల్ సెలవు రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
బెటాలియన్ కానిస్టేబుళ్ల సెలవుల రద్దు నిర్ణయాన్ని పోలీస్ శాఖ తాత్కాలికంగా వాయిదా వేసింది. కానిస్టేబుళ్ల కుటుంబసభ్యుల ఉద్యమం నేపథ్యంలో పోలీస్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సెలవులు రద్దు చేస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి నిర్ణయం తీసుకునే వారికి ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశాయి. కాగా ఒకే పోలీస్ విధానం ఉండాలని.. తమిళనాడు, కర్ణాటకలో ఉన్న విధానం అమలు చేయాలని కుటుంబసభ్యులు చేసిన డిమాండ్‌ను కూడా పోలీస్ శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook