Telangana Assembly Election 2023 Notification: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఫారం-1 నోటీసును రిటర్నింగ్ అధికారులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. నేటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 15వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలను వెల్లడిస్తారు. నామినేషన్ల ప్రక్రియ మొదలైన వెంటనే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తొలి నామినేషన్ దాఖలైంది. ఇండిపెండ్ అభ్యర్థిగా బీజేపీ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కుమారుడు వినీత్ రావు నామినేషన్ వేశారు.
ఇప్పటికే షెడ్యూల్ వచ్చేయగా.. తాజాగా నోటిఫికేషన్ రావడంతో అభ్యర్థులు ప్రచారానికి పరుగులు పెట్టించనున్నారు. మరోవైపు నామినేషన్ దాఖలుకు మూహుర్తాలు చూసుకుంటున్నారు. నేడు నేడు, 4, 7, 8, 9, 10వ తేదీల్లో నామినేషన్లు ఎక్కువ సంఖ్యలో దాఖలు అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తం 119 స్థానాల్లో 117 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్. కాంగ్రెస్ 100 స్థానాలకు ప్రకటించగా.. బీజేపీ 88 స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేయడంతో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎలక్షన్ కమిషన్ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఆ నిబంధనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: IND Vs SL Highlights: శ్రీలంకకు టీమిండియా అదిరిపోయే పంచ్.. సెమీస్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook