CM KCR Birthday Celebrations: సీఎం కేసీఆర్ రేపు 68వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సీఎం జన్మదిన వేడుకలు (CM KCR Birthday Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు మూడు రోజులపాటు నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే.. మంగళవారం అన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
ఇవాళ కూడా తెలంగాణ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే..సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన బ్లడ్ క్యాంప్ లో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పాల్గొని రక్తదానం చేశారు. కేసీఆర్ గొప్ప ఉద్యమకారుడు అని.. ఆయన పోరాటం వల్లే తెలంగాణ వచ్చిందని ఈ సందర్భంగా హారీష్ రావు (Harish Rao) అన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్థులకు, గర్భిణీల కోసం రక్తం సేకరిస్తే.. కొంత మంది నాయకులు దానిని రాజకీయం చేస్తున్నారంటూ విమర్శులు గుప్పించారు.
On the birthday eve of Hon'ble #CMKCR Garu, I have donated blood at Narayankhed Area Hospital.
CM KCR Garu is a leader who has served and continues to serve the people, we follow his able leadership for serving mankind.#HappyBirthdayKCR pic.twitter.com/Uv5L3rIFzD
— Harish Rao Thanneeru (@trsharish) February 16, 2022
తెలంగాణ..డెవలప్ మెంట్ లో దేశంలోనే ముందుందని హారీష్ రావు వ్యాఖ్యానించారు. రైతు సంక్షేమం విషయంలో తెలంగాణ (Telangana) అగ్రస్థానంలో ఉందన్నారు. నీటిపారుదల, విద్యుత్ రంగాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలోనూ మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ ముందంజలో ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భాజపా తీరును ఎండగట్టారు హారీష్. నిరుపేదల పొట్టగొట్టి పెద్దలకు దోచి పెడుతున్నారంటూ భాజాపా ప్రభుత్వాన్ని విమర్శించారు.
Also Read: Uddhav Thackeray-KCR: తెలంగాణ సీఎంకు ఉద్ధవ్ ఠాక్రే ఫోన్... ముంబై రావాలని ఆహ్వానం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook