brs ktr sensational tweet on revanth reddy: తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ల మధ్య.. తగ్గా ఫార్ వార్ నడుస్తొందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో తెలంగాణ.. బీఆర్ఎస్ సర్కారు చేసిన తప్పిదాల వల్లే వెనక్కు వెళ్లిపోయిందని విమర్శలు గుప్పిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం దీనికి గట్టిగానే కౌంటర్ లు ఇస్తు అమలు కానీ,. 420 హమీలు ఇచ్చి కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిందని కూడా విమర్శిస్తున్నారు. అంతే కాకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదికి దగ్గర పడుతుందని ఇప్పటికి కూడా రుణ మాఫీ, పింఛన్ ల విషయంలో ప్రజల్ని డైవర్ట్ చేస్తుందని బీఆర్ఎస్ నేతలు ఏకీపారేస్తున్నారు.
మరొవైపు కాంగ్రెస్ మంత్రి పొంగులేటీ మాత్రం.. మళ్లీ తొందరలోనే ఆటంబాంబు పేలుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తొందరలోనే బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ అవుతారని కూడా జోస్యం చెప్పారు. గతంలో కూడా సియోల్ నుంచి పొంగులేటీ ఇలాంటి కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.దీనికి కౌంటర్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం గట్టిగానే ఫైర్ అయినట్లు తెలుస్తొంది. అంతే కాకుండా..తాను అరెస్టులకు భయపడేదని లేదని కూడా తెల్చి చెప్పారు.
Happy Birthday @revanth_anumula
I am very much in Hyderabad. Your agencies are welcome anytime
Chai, Osmania biscuits and if they want to cut your birthday cake, it’s on me 👍 https://t.co/ccPOezg1WC
— KTR (@KTRBRS) November 8, 2024
జైలుకు పంపిస్తే.. ఆతర్వాత మళ్లీ బైటకు వచ్చి పాదయాత్ర చేస్తానని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఈరోజు సీఎం రేవంత్ బర్త్ డే సందర్భంగా కేటీఆర్ మరోసారి సెటైర్ లు వేశారు. ఒక వైపు సీఎం రేవంత్ కు బర్త్ డే విషేస్ చెప్తునే.. తాను హైదరాబాద్ లోనే ఉన్ననని, మీ ఏసీబీ లాంటి ప్రభుత్వ ఏజెన్సీలను ఎప్పుడు పంపిన స్వాగతం అంటూ పోస్ట్ పెట్టారు. వారిని..చాయ్ ఉస్మానియా బిస్కెట్ తోపాటు, మీ బర్త్ డే కేక్ వారు కట్ చేస్తామంటే నేనే ఇప్పిస్తానని, దగ్గరుండి కేక్ కట్ చేయించే కార్యక్రమం చేస్తానని చురకలు పెట్టారు.
అంతే కాకుండా.. అరెస్టుల భయంతో మలేషియాకు పారిపోయానని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణల్ని కేటీఆర్ ఖండించారు. ఇదిలా ఉండగా.. సీఎం రేవంత్ ఈ రోజు యాదాద్రికి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు సైతం నిర్వహించారు. సీఎం రేవంత్ కు.. దేశ ప్రధాని మోదీ, మెగాస్టార్ చిరంజీవి కూడా జన్మదినం సందర్భంగా విషేస్ చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.