ATHRAM SAKKU: తెలంగాణలో మరోసారి జంపింగ్‌లు షురూ కాబోతున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది. కారు దిగేందుకు సిద్దమైన గులాబీ లీడర్లే టార్గెట్‌గా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ మొదలుపెట్టినట్టు సమాచారం. ఇందులో భాగంగా చేరికలపై హస్తం పార్టీ స్పీడ్ పెంచింది. తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎంపీ సోయం బాపురావును చేర్చుకుని చేరికలు మళ్లీ షురూ అయ్యాయనే సంకేతాలు ఇచ్చారట.. అయితే జాయినింగ్స్ మళ్లీ షురూ కావడంతో గులాబీ పార్టీలో ఆందోళన మొదలైన్నట్టు ప్రచారం జరుగుతోంది.
తాజాగా బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన సీనియర్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీజేపీ నేత, ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపురావు, బీఆర్ఎస్ నేత, కుమురం భీమ్ ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు .. గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. అయితే రెండు పార్టీల నేతల చేరిక తర్వాత టీపీసీసీ చీఫ్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు తమకు టచ్‌లో ఉన్నారని .. మంచిరోజు చూసుకుని ఆ నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రకటించారు.
ప్రస్తుతం కొంతమంది బీఆర్ఎస్ నేతలు తమతో టచ్ లో ఉన్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. వారంతా శుభ ముహూర్తం చూసుకుని కండువా మార్చేస్తారని చెప్పుకొచ్చారు. నిన్న ఆదిలాబాద్ కు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, బీజేపీ మాజీ ఎంపీ సోయం బాపూరావు కాంగ్రెస్ లో చేరిపోయారు. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఎవరెవరు కండువా మార్చేందుకు రెడీగా ఉన్నారనే ఉత్కంఠను రేపుతోంది. పార్టీకి ఎవరు దూరంగా ఉంటున్నారు, ఎవరు అసంతృప్తిగా ఉంటున్నారు అనే చర్చ మొదలైంది.
ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాలనపై కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ఆరు గ్యారెంటీలతో పాటు.. ఏడాది పాలనను ప్రజలకు వివరిస్తోంది. గత పాలనకు.. కాంగ్రెస్ పాలనకు తేడాను ప్రజలకు చెబుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్‌గా ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలంటే ప్రచారం కూడా అవసరమని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. అయితే స్థానికంలో బీఆర్ఎస్ను మరోసారి గట్టి దెబ్బకొట్టాలంటే.. గులాబీ పార్టీ నేతల జాయినింగ్ కూడా అవసరమని లెక్కలు వేస్తున్నారట. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగేసుకుని.. ఎన్నికల్లో భారీ లబ్ధి పొందాలని నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే నేతల చేరికలపై గాంధీభవన్ వర్గాలు మరోసారి ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది..
మొత్తంగా టీపీసీసీ కామెంట్స్‌పై గులాబీ పార్టీ పరేషాన్ అవుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ మారే ఎమ్మెల్యేలు ఎవరని గులాబీ లీడర్లు ఆరా తీస్తున్నారట. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నేతలు జంప్ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. దాంతో వారిని బుబ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం. అయితే పార్టీ మారాలని అనుకుంటున్న నేతలందరూ భూ మాఫియా, కేసుల భయం, వివిధ కారణాలతోనే జంప్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ ఎమ్మెల్యేలకు పార్టీ పెద్దలు బుజ్జగించినా ముందు ఒకే అనేసి ఆ తర్వాత తమ పని కానిచేద్దాం అనే ధోరణిలో ఉన్నారట.. మొత్తంగా టీపీసీసీ కామెంట్స్‌తో బీఆర్ఎస్ పార్టీకి మరో దెబ్బ తప్పదా అనే చర్చ జోరుగా సాగుతోంది..
Also Read: Telangana Politics: రేవంత్ రెడ్డి కోరిక.. కేసీఆర్ తీరుస్తారా?
Also Read: Telangana Politics: కేసీఆర్ Vs రేవంత్.. ఒక రాష్ట్రం.. ఇద్దరు తల్లులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.