Fengal Cyclone Effect: బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను తీవ్ర ప్రభావం నుంచి బయటపడ్డామని భారత వాతావరణ శాఖ చెప్పింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు ఫెంగల్ తుఫాను ముప్పు తప్పింది. కానీ, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రభావం రెండు రాష్ట్రాలపై ఎలా ఉంటుంది తెలుసుకుందాం.
నిన్న బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కొనసాగుతూ ఉండగా ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఉదయం నుంచి భారీ వర్షాలు కురిసాయి. దీని ప్రభావం ఈరోజు కూడా కొనసాగుతుంది అనుకున్నారు. ప్రమాదం పెరుగుతుంది అని వాతావరణ శాఖ అంచనా వేసింది.
కానీ, రాష్ట్రానికి తుఫాను ముప్పు తప్పింది. అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది శ్రీలంక, తమిళనాడు గుండా తీరం దాటనుంది. ఇప్పటికే ఈ ఏడాది భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలమైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తుఫాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండదని, ముప్పు తప్పిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అయితే, అలాగే తమిళనాడులోని తీర ప్రాంత ప్రజలను హెచ్చరించింది. ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.
ముఖ్యంగా ఈ ప్రభావం వల్ల చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో రెండు రోజులుపాటు భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పింది. ఇక కోస్తా, రాయలసీమలో మోస్తారు వర్షపాతం నమోదు అవుతుందని తెలిపింది.
రైతులు, మత్స్యకారులకు అలెర్ట్ చేసింది వాతావరణ శాఖ. తీర ప్రాంత ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్లకపోవడమే మేలు అని చెప్పింది. ఇక తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. ఆయా ప్రాంతాల్లో స్కూళ్లకు కూడా సెలవులు ఇవ్వచ్చు.
ఈ ప్రభావం తెలంగాణపై ఉండదని, రానున్న రెండు రోజులు కూడా పొడి వాతావరణం నమోదు అవుతుందని వాతావరణ శాఖ చెప్పింది. గత కొన్ని రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాల కారణంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశాలో భారీ వర్షాలు కురిసాయి. వరదలు కూడా వచ్చాయి.
ఎప్పటికప్పుడు ప్రజలను అలెర్ట్ చేసి తగిన జాగ్రత్తలు తీసుకోమని వాతావరణ శాఖ అలెర్ట్ చేస్తోంది. ప్రభుత్వం కూడా తీర ప్రాంత ప్రజలకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులను కూడా మంజూరు చేస్తోంది. రానున్న రెండు రోజులు కూడా రెండు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరింది. కానీ, తుఫాను ముప్పు అయితే తప్పింది.