BJP National Executive Meet: హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రేపటి (జూలై 2) నుంచి రెండు రోజుల పాటు జరగనున్నాయి. గతేడాది ఢిల్లీ వేదికగా జరిగిన సమావేశాలు ఈసారి హైదరాబాద్‌కు షిఫ్ట్ అవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మిషన్ తెలంగాణలో భాగంగానే బీజేపీ హైదరాబాద్‌లో ఈ సమావేశాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సౌత్‌లో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే కమలం పార్టీకి స్కోప్ ఉందని ఆ పార్టీ పెద్దలు లెక్కలేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే తెలంగాణపై గట్టిగా ఫోకస్ పెట్టారు.
రేపు మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకోనున్న మోదీ :
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆ పార్టీ జాతీయ నాయకులు, బీజేపీ ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు తదితర నేతలు పాల్గొననున్నారు. వీరిలో కొందరు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రేపు (జూలై 2) మధ్యాహ్నం 3.20గం. సమయంలో ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 4గం. నుంచి రాత్రి 9గం. వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళే హైదరాబాద్ చేరుకోనున్నారు.
తెలంగాణతనం ఉట్టిపడేలా :
నోవాటెల్ హెచ్ఐసీసీలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణలో అడుగడుగునా తెలంగాణతనం ఉట్టిపడేలా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా సమావేశ ప్రాంగణానికి శాతవాహన నగరంగా, సమావేశస్థలికి కాకతీయ ప్రాంగణంగా, జాతీయ ప్రధాన కార్యదర్శుల ప్రాంగణానికి వందేమాతరం రామచంద్రరావు ప్రాంగణంగా నామకరణం చేశారు. భోజనశాలకు భాగ్యరెడ్డి వర్మ ప్రాంగణంగా, మీడియా హాల్‌కు షోయబుల్లా ఖాన్ హాల్‌గా, అతిథులు బస చేసే ప్రాంగణానికి సమ్మక్క సారలమ్మ ప్రాంగణంగా నామకరణం చేశారు. తెలంగాణ కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌కు కొమురం భీమ్ ప్రాంగణంగా నామకరణం చేశారు. ఫుడ్ మెనూలోనూ తెలంగాణ వంటకాలకు ప్రాధాన్యతనిచ్చారు. కరీంనగర్‌కి చెందిన యాదమ్మను ప్రత్యేకంగా పిలిపించి ఆమెతో తెలంగాణ వంటకాలు చేయిస్తున్నారు.
సమావేశాల షెడ్యూల్ :
సమావేశాల్లో భాగంగా శనివారం (జూలై 2) ఉదయం పదాధికారుల సమావేశంలో తీర్మానాలు, ఎజెండా ఖరారవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు జాతీయ కార్యవర్గ భేటీ ప్రారంభమవుతుంది. రాత్రి 9గం. వరకు సమావేశం కొనసాగుతుంది. మరుసటి రోజు జూలై 3న ఉదయం 10గం. నుంచి సాయంత్రం 5గం. వరకు సమావేశాలు కొనసాగుతాయి. సాయంత్రం 6గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో విజయ సంకల్ప సభ ఉంటుంది. ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తారు.
Also Read: TS TET 2022: ఇవాళ తెలంగాణ టెట్ ఫలితాలు రిలీజ్... త్వరలో టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Also Read: Horoscope Today July 1st: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి లక్కీ టైమ్.. అనుకున్నది జరుగుతుంది...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook