హైదరాబాద్‌లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు మీద ఏర్పడిన ఎన్టీఆర్ గార్డెన్స్ పేరును మార్చనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై ఎన్టీఆర్ గార్డెన్ అనేపేరు కేవలం ఆయన సమాధి ప్రదేశానికే వర్తిస్తుంది. గార్డెన్స్‌కు మాత్రం అంబేద్కర్ పేరు పెట్టాలని నిశ్చయించినట్లు, అందుకోసం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట కోసం ఆర్డరు పంపించినట్లు కూడా ఇటీవలే తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. అలాగే ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు ఆధ్వర్యంలో గార్డెన్స్‌కు సంబంధించిన అయిదెకరాల ప్రాంతంలో అంబేద్కర్ మెమోరియల్ మ్యూజియం కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఒక ప్రతిపాదన ఉంది. ఈ కమిటీకి ఛైర్మన్‌గా తెలంగాణ సీఎంయే వ్యవహరించనున్నారు. తొలుత ఈ ప్రాజెక్టు నిమిత్తం అదే ఏరియా క్రిందకు వచ్చే 20 ఎకరాలను ఎస్సీ డెవలప్మెంట్ అథారిటీ అడగగా, ప్రస్తుతం ఆ ప్రాంతానికి సంబంధించి, పలు ప్రైవేటు ఏజెన్సీలతో ప్రభుత్వానికి ఒప్పందం ఉన్నందున, కేవలం 5 ఎకరాలకే సర్కారు అనుమతిని అందించింది.