Allu Arjun Case: సినిమా థియేటర్లో తొక్కిసలాట ఘటనలో ఓ వివాహిత మృతి చెందిన సంఘటనలో అరెస్టయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. రాత్రంతా హైడ్రామా కొనసాగగా చివరకు అర్జున్ బయటకు రాకపోవడంతో నిద్రపోకుండా కుటుంబసభ్యులు అతడి కోసం ఎదురుచూశారు. ఎట్టకేలకు జైలు నుంచి అల్లు అర్జున్ శనివారం ఉదయం ఏడు గంటలకు విడుదలవడంతో అతడు జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే జైలు నుంచి విడుదల కావడంతో పోలీసులు రహాస్యంగా ఉంచారు.
Also Read: K Kavitha: రేవంత్ రెడ్డి పిరికి ముఖ్యమంత్రి.. ఇక ఊరూరా పోరాటం చేస్తాం
విడుదలైన అనంతరం అల్లు అర్జున్ నేరుగా జూబ్లీహిల్స్‌లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న తన బృందంతో చర్చలు జరిపిన అనంతరం అక్కడి నుంచి అర్జున్ తన నివాసానికి చేరుకున్నారు. దాదాపు రెండు గంటలు చర్చించినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇంటికి చేరుకోవడంతో అక్కడ భావోద్వేగ వాతావరణం అలుముకుంది. అనంతరం గుమ్మడికాయతో కుటుంబసభ్యులు దిష్టి తీశారు.
Also Read: Revanth Reddy: అల్లు అర్జున్ దేశం కోసం ఏం చేశారు? రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు
అనంతరం అభిమానులకు అభివాదం చేసిన తర్వాత అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. 'నేను బాగానే ఉన్నా. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు' అని ప్రకటించారు. తాను చట్టాన్ని గౌరవిస్తాననని తెలిపారు. తనకు మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు చెప్పారు. సంధ్య థియేటర్లో మృతి చెందిన రేవతి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. 'సంధ్య థియేటర్లో జరిగిన ఘటన దురదృష్టకరం. ఇది అనుకోకుండా జరిగిన ఘటన' అని వివరించారు. 'కేసు కోర్టు పరిధిలో ఉంది. కాబట్టి న్యాయస్థానాన్ని గౌరవిస్తూ ఇప్పుడు ఏం మాట్లాడలేను' అల్లు అర్జున్ పేర్కొన్నారు.
కాగా అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ లభించినా కూడా ఉద్దేశపూర్వకంగా ఒక రోజు రాత్రి జైలులో ఉంచారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని అల్లు అర్జున్ కుటుంబసభ్యులతోపాటు అల్లు అభిమానులు కూడా భావిస్తున్నారు. త్వరలోనే ఈ వ్యవహారంపై కూడా న్యాయస్థానంలో పోరాటం చేస్తామని అల్లు అర్జున్ న్యాయవాదులు చెప్పడం సంచలనంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter