Don't do these Mistakes in WhatsApp: ప్రస్తుతం వాట్సాప్ వినియోగం ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెసేజ్‌లు, వీడియోలు, డ్యాక్యుమెంట్లు, ఆడియో, వీడియో కాల్స్ ఇలా అనేక రకాలుగా వాట్సాప్ ఉపయోగపడుతోంది. కొత్తకొత్త అప్డేట్స్ తీసుకువస్తూ.. యూజర్లకు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకువస్తోంది. అయితే వాట్సాప్‌ను జాగ్రత్తగా ఉపయోగిస్తే.. ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ మీరు చేసే చిన్న చిన్న తప్పులు మిమ్మల్ని జైలుపాలు చేసే ప్రమాదం ఉంది. వాట్సాప్‌లో కొన్ని విషయాలపై నిషేధం విధించారు. వాటి గురించి మీరు షేర్ చేస్తే.. ప్రమాదంలో పడినట్లే. వాట్సాప్‌లో ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకోండి.
చైల్డ్ పోర్నోగ్రఫీ
వాట్సాప్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వాట్సాప్‌లో ఫొటో లేదా వీడియోను షేర్ చేస్తే.. జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. చైల్డ్ పోర్నోగ్రఫీ చట్టాన్ని ఉల్లంఘించడంతో గత కొన్నేళ్లలో ఢిల్లీ పోలీసులు చాలా మందిని అరెస్ట్ చేసి శిక్ష పడేలా చేశారు. పొరపాటున కూడా వాట్సాప్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన కంటెంట్‌ను ఎప్పుడు వెతకవద్దు. వాట్సాప్‌లో ఎప్పుడూ షేర్ చేయవద్దు.
Also Read: Adipurush Collections: ఆదిపురుష్ మూవీ టీమ్‌కు షాక్.. అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు క్యాన్సిల్స్
వివక్షను పెంచే వీడియోలు
వాట్సాప్‌లో సమాజంలో వివక్షను వ్యాప్తి చేసే వీడియోలు, ఫొటోలు, మెసేజ్‌లు షేర్ చేసినా ప్రమాదంలో పడినట్లే. చట్టాన్ని ఉల్లంఘించినందుకు మీరు శిక్షార్హులవుతారు. వాట్సాప్‌లో మీకు ఇలాంటి వీడియో కనిపిస్తే.. ఫార్వార్డ్ చేయకుండా వెంటనే డిలీట్ చేయండి. సమాజంలో వివక్షను వ్యాప్తి చేసే మెసేజ్‌లు, వీడియోలు, ఫొటోలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరికి షేర్ చేయవద్దు.
ఫేక్ న్యూస్
ప్రస్తుతం అసలైన సమాచారం కంటే.. తప్పుడు ప్రచారాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. తమకు వచ్చిన సమాచారం నిజమో కాదో తెలుసుకోకుండా.. చాలా మంది ఫేక్ వార్తలను స్ప్రెడ్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఫేక్ న్యూస్ విషయంలో వాట్సాప్ విధానం కూడా కఠినంగా వ్యవహరిస్తోంది. నకిలీ వార్తల విషయంలో ప్రభుత్వం కూడా సీరియస్‌గానే ఉంది. ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేసి సమాజంలో, దేశంలో హింస లేదా వివక్ష లాంటివి వ్యాపిస్తే అది చట్టరీత్యా నేరం కింద పరిగణిస్తారు. వాట్సాప్‌లో నకిలీ వార్తలను షేర్ చేస్తే.. జైలుకు వెళ్లే ప్రమాదం ఉంది. మీకు వచ్చిన సమాచారం నిజమో కాదో ముందుగా నిర్ధారణ చేసుకుని.. ఇతరులతో పంచుకోండి.
Also Read: Vijay Speech: ఓటుకు నోటుపై హీరో విజయ్ సంచలన వ్యాఖ్యలు.. రాజకీయ రంగ ప్రవేశానికి రెడీ..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook