Redmi Note 13 Pro: ఏకంగా 108 మెగాపిక్సెల్, 200 మెగాపిక్సెల్ కెమేరాతో 8జీబీ ర్యామ్ కలిగిన ఫోన్ కావడంతో మార్కెట్‌లో క్రేజ్ పెరుగుతోంది. రెడ్‌మి గత మోడల్స్ కంటే భిన్నమైన ఫీచర్లు, డిజైన్‌తో ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర, ఇతర వివరాలు తెలుసుకుందాం.
Redmi Note 13 Pro స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచెస్ 1.5 కే కర్వ్డ్ ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉండటం వల్ల రిజల్యూషన్ అద్భుతంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ చిప్‌సెట్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తూ 5100 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇందులో ట్రిపుల్ కెమేరా సెటప్ ఉంది. 200 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మెయిన్ కేమేరా ప్రధాన ఆకర్ణణగా ఉంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉన్నాయి. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ కెమేరా అమర్చారు.
Redmi Note 13 Pro స్కార్లెట్ రెడ్ కలర్ వేరియంట్ 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ ధర 24,999 రూపాయలు కాగా ఇందులోనే 256 జీబీ స్టోరేజ్ అయితే 26,999 రూపాయలుగా ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్టు, ఐసీఐసీఐ, హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే 3 వేల రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది.
ఇక Redmi Note 13 కూడా మార్కెట్‌లో లాంచ్ అయింది. ఈ ఫోన్ 6.67 ఇంచెస్ ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తూ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇందులో కూడా ట్రిపుల్ కెమేరా సెటప్ ఉంది. ఇందులో మెయిన్ కెమేరా 108 మెగాపిక్సెల్ కాగా సెల్ఫీ లేదా వీడియా కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. ఇక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఇందులో 6జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 16,999 రూపాయలు కాగా 8జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ వేరియంట్ అయితే 18,999 రూపాయలుగా ఉంది. ఇందులోనే 12జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ కూడా అందుబాటులో ఉంది. ఈ వేరియంట్ ధర 20,999 రూపాయలుగా ఉంది. ఎస్బీఐ, యాక్సిస్, హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీఐ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 1500 రూపాయలు డిస్కౌంట్ అందుతుంది.
Redmi Note 13 Proలో స్కార్లెట్ రెడ్ అనేది కొత్తగా లాంచ్ అయిన కలర్. ఇక Redmi Note 13 అయితే కొత్తగా క్రొమాటిక్ పర్పుల్ రంగు మార్కెట్‌లో వచ్చింది.
Also read: ITR Filing 2024: రెండు మూడు ఉద్యోగాలు మారుంటే, ఐటీ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Redmi Note 13 Pro: 108MP, 200MP కెమేరా, 12 జీబీ ర్యామ్‌తో రెడ్‌మి నోట్ 13 ప్రో లాంచ్