Infinix Note 40 Series Price In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇన్ఫినిక్స్ నుంచి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది అత్యద్భుతమైన డిజైన్‌తో ప్రీమియం ఫీచర్స్‌తో విడుదల కానుంది. దీనిని కంపెనీ ఇన్ఫినిక్స్ నోట్ 40 సిరీస్ పేరుతో అందుబాటులోకి తీసుకు రానుంది. అలాగే ఇందులో అనేక రకాల ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ సిరీస్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
ఈ ఇన్ఫినిక్స్ నోట్ 40 సిరీస్(Infinix Note 40 Series)లో కంపెనీ వివిధ మోడల్స్‌ను పరిచయం చేయబోతోంది. అంతేకాకుండా ఈ సిరీస్‌ను కంపెనీ మొదట మార్చి 3న ఇండోనేషియాలో లాంచ్ చేసి, ఆ తర్వాత గ్లోబల్ లాంచింగ్ చేయబోతున్నట్లు తెలిపింది. అలాగే ఇందులో కంపెనీ అనేక రకాల అధునాత ఫీచర్స్‌ను కూడా అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన కెమెరా వివరాల్లోకి వెళితే.. దీని బ్యాక్ సెటప్‌లో కంపెనీ 64 MP ప్రైమరీ లెన్స్ కెమెరాను కూడా అందిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఫ్రంట్ భాగంలో 32 MP కెమెరాను కూడా అందిస్తోంది. అలాగే ఇందులో ప్రత్యేకమైన LED ఫ్లాష్‌లైట్‌ను కూడా కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో కంపెనీ AI ఆధారిత ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది. ఇందులో స్మార్ట్ బ్యాటరీ ఫీచర్స్‌తో పాటు అనేక AI ఫీచర్స్ అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఫాస్ట్ ప్రాసెసింగ్ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. అయితే ఈ ఫీచర్స్‌కు సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. వీలైన తొందరలోనే ఈ మొబైల్‌కి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు. ఇక ఈ మొబైల్ సిరీస్‌లకు సంబంధించిన మొదటి మొబైల్ X6855 మోడల్ నెంబర్‌తో విడుదల కాబోతోంది.
ఇంకా కంపెనీ ఈ ఇన్ఫినిక్స్ నోట్ 50 సిరీస్‌కి సంబంధించిన ధర వివరాలను కూడా వెల్లడించలేదు. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన డిజైన్ వివరాల్లోకి వెళితే, గతంలో ఈ కంపెనీ విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్ కంటే చాలా అధునాతన ఫీచర్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైన AI ఆధారిత ఫీచర్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లు లీక్ అయిన వివరాల్లో వెల్లడైంది. ఇందులో ప్రత్యేకంగా మెరుగైన ఇమేజ్ ప్రాసెసింగ్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి