Jio New Plans: ఎయిర్‌టెల్, Vi కి జియో షాక్.. అత్యంత తక్కువ ధరకే మూడు నెలల ప్లాన్..!

Jio vs Airtel:ఇటీవల టెలికాం కంపెనీలు.. అన్నీ టారీఫ్ ను పెంచిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా జియో చార్జీల పెంపుపై.. సోషల్ మీడియాలో సైతం అసంతృప్తి వ్యక్తం అవుతుంది. అయితే ధర పెరిగినప్పటికీ మిగిలిన టెలికాం.. కంపెనీలతో పోల్చుకుంటే జియో ప్లాన్స్ చౌకగా ఉన్నాయి అన్న విషయం మీకు తెలుసా?

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Aug 5, 2024, 11:51 AM IST
Jio New Plans: ఎయిర్‌టెల్, Vi కి జియో షాక్.. అత్యంత తక్కువ ధరకే మూడు నెలల ప్లాన్..!

Jio’s 98 day cheap plan : ప్రస్తుతం టెక్నాలజీ వాడకం పెరిగిపోవడంతో మార్ట్ ఫోన్ల వినియోగం అంతకంత ఎక్కువయింది. ఇండియాలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఇంతగా పెరగడానికి జియో ప్రధాన కారణమని అందరూ భావిస్తారు. సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా డేటా ప్యాక్కులతో ఇంటర్నెట్ వాడకాన్ని విపరీతంగా పెంచేయడంలో జియో ప్రధాన పాత్ర పోషించింది. అయితే క్రమేపీ పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా జియో తన ధరలను కూడా పెంచుతూ వచ్చింది. మార్కెట్లో జియో ఏది చేస్తే అది ఆచరించడం అలవాటైపోయిన మిగిలిన టెలికాం సంస్థలు కూడా అదే రకంగా తమ ప్లాన్ రేట్లు పెంచుకుంటూ వచ్చాయి.

ఇటీవల టెలికాం కంపెనీలు తమ టారిఫ్ ను బాగా పెంచేశాయి. దీంతో రీఛార్జి రేట్లు బాగా పెరిగాయి. మరి ముఖ్యంగా జియో రేట్ల పెంపుపై సోషల్ మీడియాలో భారీగా అసంతృప్తి వ్యక్తం అవుతోంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ధర పెరిగినప్పటికీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు పోల్చుకుంటే జియో చాలా చౌక. జియో తో పాటుగా ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు తమ రీఛార్జి ప్లాన్ ధరలను పెంచాయి. అయితే జియో ప్లాన్ ధరలు ఇతర టెలికాం కంపెనీల ధరల కంటే కూడా చాలా తక్కువ నే చెప్పవచ్చు. 

గత వారం ప్రారంభంలో జియో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ రీఛార్జి ప్లాన్ల ధరలను 10 నుంచి 21 శాతం వరకు పెంచింది. అనంతరం ఇదే పాలసీని ఫాలో అవుతూ ఎయిర్టెల్ తన ధరలను 25 శాతం పెంచింది. ఈ రేట్లు జూలై మూడవ తారీకు నుంచి అమల్లోకి వచ్చాయి. నిజానికి ధర పెరిగినప్పటికీ మిగిలిన టెలికాం సంస్థలతో పోల్చుకుంటే జియో సేవలు తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఉదాహరణకి 249 రూపాయల జియో ప్లాన్ వేయించుకున్న వ్యక్తి రోజుకి ఒక జీబీ డేటా తో పాటుగా అన్లిమిటెడ్ టాక్ టైం పొందుతాడు. ఇదే మీరు ఎయిర్టెల్ లో తీసుకోవాలి అంటే సుమారు 299 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే సగటున నెలకి 50 రూపాయలు  ఆదా అవుతుంది. 

ఇక జియో 98 రోజులకు గాను అందిస్తున్న 999 రూపాయల ప్లాన్ వినియోగదారుడికి అపరిమిత వాయిస్ కాలింగ్ వసతితోపాటు 2 జీబీ డేటా ప్రయోజనాన్ని పొందుతారు. దీంతోపాటుగా ఈ ప్లాన్ లో రోజువారి 100 ఉచిత ఎస్ఎంఎస్ లతో పాటు జియో యాప్లను కూడా ఉచితంగా పొందవచ్చు. ఇక 5జి నెట్వర్క్ ఉన్నవారు ఈ ప్లాన్ ద్వారా అపరితమైన 5జి డేటా ప్రయోజనాన్ని కూడా పొందగలుగుతారు. అయితే ఎయిర్టెల్ 90 రోజులకు గాను అందించే 929 రూపాయల ప్యాకేజీలో వినియోగదారుడు కేవలం 1.5 జీబీ డేటా పొందుతాడు. అపరిమిత కాలింగ్ తో పాటుగా 100 ఉచిత ఎస్ఎంఎస్ వసతి కూడా ఉంది. ఇలా మనం ఏ ప్లాన్ తీసుకున్న జియో అందించే సేవలు మిగిలిన సంస్థల సేవలకంటే కూడా తక్కువ ధరకే అందుతున్నాయి.

Also Read: Double iSmart: డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ విడుదల.. ఎంటర్టైన్మెంట్ డబుల్.. అంచనాలు కూడా డబుల్..!

Also Read: Rajamouli: బాహుబలిలో అలాంటి తమన్నా సీన్స్ అందుకే పెట్టాము.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News