పశ్చిమ బెంగాల్ ( West Bengal ) అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయాలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ( BJP ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( JP Nadda ) బెంగాల్ పర్యటన ఉద్రిక్తంగా మారింది.
Mamata Benerjee: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ బంద్ విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్విస్ట్ ఇచ్చారు. రైతు చట్టాలకు సంబంధించి ఆమె మాట మార్చారు.
ప్రముఖ బెంగాలీ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత సౌమిత్ర ఛటర్జీ (85) ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. గతనెలలో సౌమిత్ర ఛటర్జీకి కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయిన తరువాత కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేరారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు (West Bengal Assembly elections) వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్నాయి. ఈ క్రమంలో బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు చీఫ్ దిలీప్ ఘోష్ (BJP Bengal president Dilip Ghosh) మమతా మద్దతు దారులను (TMC cadres) హెచ్చరిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలో పడవ మునిగి అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ విషాద సంఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
భారతీయ రైల్వే (Indian Railways) మరో అరుదైన ఘనతను సాధించింది. పుష్-పుల్ కార్యకలాపాల కోసం తయారుచేసిన తేజస్ ఎక్స్‌ప్రెస్ లోకోమోటివ్ను ఇండియన్ రైల్వే శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించింది.
పేదరికంలో మగ్గుతున్న ఓ వృద్ధురాలికి (Elderly woman) చేప రూపంలో అదృష్టం తలుపుతట్టింది. దీంతో ఆమె రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యింది. చేప రూపంలో కష్టాలు తీరడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
COVID-19 cases in West Bengal: అక్టోబర్ 1 నుంచి పశ్చిమ బెంగాల్లో సినిమా హాల్స్, ఓపెన్ ఎయిర్ థియేటర్స్ పునఃప్రారంభించుకునేందుకు అనుమతిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జి ( CM Mamata Banerjee ) ప్రకటించారు. అంతేకాకుండా వచ్చే నెల నుంచి మ్యూజిక్ షోలు, డ్యాన్సింగ్ ఈవెంట్స్, మ్యాజిక్ షోలకు ( musical, dance and magic shows ) కూడా అనుమతి ఇస్తామని మమతా బెనర్జీ స్పష్టంచేశారు.
ప్రపంచ తీవ్రవాద సంస్థ అల్ ఖైదా (Al Qaeda) తో సంబంధాలున్న ఉగ్రవాదులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అరెస్టు చేసింది. ఈ మేరకు ఎన్ఐఏ అధికారులు పశ్చిమబెంగాల్ ( West Bengal) లోని ముర్షిదాబాద్, కేరళ (Kerala)లోని ఎర్నాకుళంలో శనివారం ఉదయం దాడులు నిర్వహించి 9మంది ఉగ్రవాదులను (Al Qaeda terrorists) అరెస్టు చేసింది.
బెంగాలీ నటి, పార్లమెంటు సభ్యురాలు మిమీ చక్రవర్తి లైంగిక వేధింపులకు గురయ్యారు. ఆమె తన కారులో ప్రయాణిస్తుండగా.. నడిరోడ్డుపై ఓ ట్యాక్సీ డ్రైవర్ మిమీ చక్రవర్తితో అసభ్యకరంగా ప్రవర్తించాడు.
కరోనా వ్యాప్తి సమయంలో ఛాయ్ పే చర్చా లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు పదుల సంఖ్యలో బీజేపీ నేతలతో పాటు, వేలాది బీజేపీ కార్యకర్తలు హాజరవుతూ కోవిడ్19 నిబంధనలకు నీళ్లొదులుతున్నారు.
CoronaVirus In India | ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని కారణంగా భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. విదేశీయులకే కరోనా వస్తుందని, విదేశాల నుంచి వచ్చిన వారికే వచ్చిందని.. భారతీయులకు కరోనా సోకలేదంటూ మొదట్లో ఎన్నో వ్యాఖ్యానాలు చేశారు. కానీ రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం పాకులాడుతున్నారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి ( Pranab Mukherjee ) ఇక లేరనే చేదు నిజాన్ని యావత్ భారతావని జీర్ణించుకోలేకపోతోంది. వివాదాలకు దూరంగా.. అజాతశత్రువుగా అందరి మనసు దోచుకున్న నాయకుడు ఆయన. తన జీవితాన్ని అంతా ప్రజాసేవకే ధారపోసిన ఆ రాజకీయ దిగ్గజం అంటే ఎవరికైనా ఇష్టమే.
ఫైర్‌బ్రాండ్ మమతా బెనర్జీ ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. ఇటు కేంద్రం, అటు యూపీ ప్రభుత్వాల్ని టార్గెట్ చేశారు. అసలేం జరుగుతోందంటూ ప్రశ్నించారు. మమతా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఇటీవల పుట్టినరోజు నాడే తమిళనాడు ఎమ్మెల్యే అన్బళగన్ కన్నుమూయడం తెలిసిందే. తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో టీఎంసీ ఎమ్మెల్యే తమోనాశ్ ఘోష్ కరోనా కారణంగా కన్నుమూశారు.
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇకపై మద్యం కూడా డోర్ డెలివరీ చెయ్యనుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఆన్లైన్ బుకింగ్ ద్వారా మద్యం హోం డెలివరీకి అమెజాన్ డాట్ కామ్‌కు గ్రీన్ సిగ్నల్
కర్ణాటకలో క్వారంటైన్ ముగించుకుని స్వస్థలాలకు వెళ్తున్న పశ్చిమ బెంగాల్ వాసులు శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలిగాం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పశ్చిమ బెంగాల్‌కి చెందిన 42 మంది వలస కూలీలు ( Migrant workers from West Bengal ) ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు బాలిగాం సమీపంలో బోల్తా పడింది.
అంఫాన్ తుఫాన్ ( Cyclone Amphan ) కారణంగా తీవ్ర నష్టాన్ని చవిచూసిన పశ్చిమ బంగాల్ (West Bengal ), ఒడిషా ( Odisha ) రాష్ట్రాల్లో నేడు ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) పర్యటించి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. మొదట పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా కోల్‌కతా ఎయిర్ పోర్టులో దిగిన ప్రధాని మోదీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జి ( Mamata Banerjee ), రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ఖర్ ( Jagdeep Dhankhar ) ఎదురెళ్లి స్వాగతం పలికారు.
దేశ వ్యాప్తంగా ఒకవైపు కరోనా మహమ్మారి కుదిపేస్తుంటే మరోవైపు తుఫాన్ బీభత్సం ప్రదర్శిస్తోంది. కాగా పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రధాని మోదీ శుక్రవారం పర్యటించనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది.
కోల్‌కతా : అంఫాన్ తుఫాన్ ( Cyclone Amphan ) భారీ ప్రాణ, ఆస్టి నష్టాన్ని మిగిల్చింది. కేవలం పశ్చిమ బెంగాల్లోనే ( West Bengal ) అంఫాన్ తుఫాన్ తాకిడికి 72 మంది మృతి చెందినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ( CM Mamata Banerjee ) తెలిపారు. చనిపోయిన 72 మందిలో 15 మంది కోల్‌కతాకు చెందిన వారేనని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.