Wage Revisions Pending RTC Employees On Strike: దేశంలోనే అతి పెద్ద రవాణా వ్యవస్థ అయిన తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 14 నెలలు గడుస్తున్నా రేవంత్ రెడ్డి పట్టించుకోకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు నిరసనలకు దిగనున్నారు. జీతాల పెరుగుదల, బకాయి పడిన చెల్లింపులు, ఆర్టీసీ ప్రైవేటీకరణ వాటికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమయ్యారు.
TSRTC MD Sajjanar: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ఎండీ సజ్జనార్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులు కొందరు తమ విధులకు హజరు అయ్యేటప్పుడు, జీన్స్, ప్యాంట్ లు, టీషర్ట్ లు వేసుకుంటున్నారు. ఆర్టీసీలోని డ్రైవర్, కండక్టర్ లతో పాటు సిబ్బంది అంతా ఒక మీదట ఫార్మల్ లోనే విధులకు రావాలని సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.
AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్న్యూస్ అందించింది. పదవీ విరమణ, ఇతర కారణాలతో ఉద్యోగాల్నించి వైదొలగిన వారికి పలు ప్రయోజనాలు కల్పించనుంది. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.
ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఈడీల కమిటీ రూపొందించిన నివేదికపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం సాయంత్రం ప్రగతి భవన్లో ఓ సమీక్షా సమావేశం జరిగింది. దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో ఈడీ కమిటీ ఇచ్చిన నివేదికపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఒక్క డిమాండ్ మినహాయించి కార్మికుల మిగతా డిమాండ్లను పరిష్కరిస్తే, ఆర్టీసీ సంస్థపై పడే ఆర్థిక భారం, సాధ్యాసాధ్యాలు ఈ సమావేశంలో చర్చకొచ్చినట్టు తెలిసింది. ఈ భేటీ అనంతరం కార్మికులతో చర్చలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.