Mallampalle Declares As Mandal In Mulugu District: తన సోదరిగా కష్టనష్టాల్లో ఉంటున్న సీతక్కకు రేవంత్ రెడ్డి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సీతక్కకు మరచిపోలేని గిఫ్ట్ ఇవ్వడంతో ఆమె ఆనందంలో మునిగితేలారు.
Bogatha Waterfall Full Flow: తెలంగాణ ‘నయాగార’గా గుర్తింపు పొందిన అందాల బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతం ఉరకలెత్తుతోంది. ఆ అందాలను కనులారా చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
Rename Mulugu District As Samakka Sarakka Mulugu District: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయిన సమక్క సారక్క తల్లుల జాతరకు నిలయంగా ఉన్న ములుగు జిల్లాకు పేరు మార్చనుంది. అడవి తల్లులైన సమ్మక్క, సారలమ్మల పేరును ములుగు జిల్లాకు పెట్టనున్నారు. ఈ మేరకు ప్రజాభిప్రాయం సేకరించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Seethakka: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ప్రజల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు తిరగలేకపోతున్నారు. తాజాగా మంత్రి సీతక్క తన సొంత నియోజకవర్గం ములుగులో ప్రజల నుంచి పరాభవం ఎదుర్కొన్నారు. రైతు బంధు విషయమై రైతులు ఆమెను నిలదీశారు. రైతుబంధు డబ్బులు ఏవి? అని ప్రశ్నించగా.. వెళ్లి బ్యాంకులో చూసుకోవాలని సూచించారు.
Mulugu: మేడారం సమ్మక్క సారాలమ్మ వేడుకలో డ్యూటీలో ఉన్న ఎస్సై పట్ల ఆదిలాబాద్ ఎస్పీ ఆలయం గౌష్ అమానుషంగా ప్రవర్తించారు. కుటుంబ సభ్యుల ముందే ఆయనపై చేయిచేసుకుని, సిబ్బందితో ఈడ్చీపడేశారు. ఈ ఘటన పోలీసు శాఖలో తీవ్ర దుమారంగా మారింది.
Mulugu: మేడారం జాతరలో కొందరు పోలీసులుప అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. దీంతో సామాన్య భక్తులు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. ఈక్రమంలో కొందరు స్థానికులు మైక్ లలో పదే పదే పోలీసులకు తమ గోడును చెప్తున్నారు.
Mulugu: సమ్మక్క సారాలమ్మ వేడుక ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో వేలాదిగా భక్తులు వనదేవతలను దర్శించుకోవడానికి పొటెత్తారు. అయితే.. జారతలో రెండో రోజు అమ్మవారి ఆలయ పరిసరాల్లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది.
Medarama Jathara 2024: ఆసియాలోనే అతిపెద్ద జాతర తెలంగాణలో రెండేళ్లకోసారి జరుగుతుంటుంది. అదే మేడారం జాతర. జాతరకు సర్వం సిద్ధమైంది. అయితే జాతర సందర్భంగా పాఠశాలలకు నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటించారు.
Surekha Affected Dengue: ఆసియాలోనే అతిపెద్ద జాతరకు మేడారం సిద్ధమవుతోంది. చకాచకా ఏర్పాట్లు జరుగాల్సి ఉండగా సంబంధిత శాఖ మంత్రి అనారోగ్యం బారినపడ్డారు. మంత్రికి డెంగ్యూ వ్యాధి సోకడంతో మేడారం జాతర పనులపై తీవ్రంగా పడింది.
Seethakka Vs KTR: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలపై తెలంగాణ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలోనూ.. ప్రజాక్షేత్రంలోనూ తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్‌పై సీతక్క విరుచుకుపడ్డారు. ప్రగతిభవన్‌లో కేటీఆర్ పెంచుకునే కుక్కల కోసం రూ.12 లక్షలు ఖర్చు చేశారని చెప్పారు. ప్రజా ధనాన్ని లూటీ చేశారని మండిపడ్డారు.
Mulugu District: దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరగ్గా తెలంగాణలో మాత్రం విషాదం నింపింది. జెండా వందనానికి ఏర్పాటుచేసిన కర్రకు విద్యుత్ సరఫరా జరిగి ఇద్దరు మృతి చెందారు. మరికొందరు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది.
చాలా ప్రదేశాల్లో మద్యపానం నిషేదించాలని.. బెల్ట్ షాపులను తొలగించాలని ఆందోళనలను, రాస్తా రోకోలు చేయటం చూసాం. కానీ ఊరిలో మద్యం షాపులు కావాలని ఊరి ప్రజలందరూ ఆందోళన చేసిన ఘటన ములుగు జిల్లాలో నెలకొంది. ఆ వివరాలు
Jampanna Vagu: జంపన్నవాగు మహోగ్రరూపం దాల్చింది. ఈ వరద ఉద్ధృతికి ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామానికి చెందిన ఎనిమిది మంది జలసమాధి అయ్యారు.
భారీ వర్షాలతో ములుగు జిల్లాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే సీతక్క ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించారు. వరద నీటిలోనే పర్యటించి.. ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ పరిస్థితులను చూసి కన్నీరు పెట్టుకున్నారు.
Bus Stuck in Flood Water Near Mulugu: హైదరాబాద్ నుంచి ములుగు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ములుగు సమీపంలో ఘట్టమ్మ ఆలయం, జాకారం మధ్య వరదలో చిక్కుకుంది. ఇక్కడ రహదారిపై వరద తాకిడి అధికంగా ఉండటంతో అదుపు తప్పిన బస్సు రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకుపోయి ఆగిపోయింది. బస్సులో 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది.
Tourists Stranded In Mulugu: ముత్యంధార జలపాతం చూసేందుకు వెళ్లి.. అభయారణ్యంలో చిక్కుకున్న పర్యాటకులను అధికారులు రక్షించారు. NDRF, DDRF బృందాలు బాధితులు ఉన్న ప్రాంతానికి అర్ధరాత్రి వేళ చేరుకుని.. ఆహారం, తాగునీరు అందజేశారు. అనంతరం సురక్షితంగా తీసుకువచ్చారు.
Minister KTR Fires On Congress: కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ నేతలను గంగిరెద్దులతో పోల్చారు. ములుగు జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. జాతీయస్థాయిలో ములుగు రెండోస్థానంలో ఉందని గుర్తుచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.