Mallampally: ఏడాది సంబరాల్లో మంత్రి సీతక్కకు రేవంత్‌ రెడ్డి అదిరిపోయే గిఫ్ట్‌!

Mallampalle Declares As Mandal In Mulugu District: తన సోదరిగా కష్టనష్టాల్లో ఉంటున్న సీతక్కకు రేవంత్‌ రెడ్డి అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సీతక్కకు మరచిపోలేని గిఫ్ట్‌ ఇవ్వడంతో ఆమె ఆనందంలో మునిగితేలారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 28, 2024, 09:49 PM IST
Mallampally: ఏడాది సంబరాల్లో మంత్రి సీతక్కకు రేవంత్‌ రెడ్డి అదిరిపోయే గిఫ్ట్‌!

Revanth Reddy Gift: అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ఏ పార్టీలో ఉన్నా రేవంత్‌ రెడ్డి, సీతక్క ఇద్దరు అన్నాచెల్లెళ్లుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే తన చెల్లికి రేవంత్‌ రెడ్డి అదరిపోయే గిఫ్ట్‌ ఇచ్చారు. గతంలో ఇచ్చిన హామీని తాజాగా రేవంత్‌ రెడ్డి నెరవేర్చడంతో సీతక్క సంబరంలో మునిగారు. అయితే సీతక్కకు రేవంత్‌ ఇచ్చిన గిఫ్ట్‌ వ్యక్తిగతంగా కాకుండా ఆమె ములుగు నియోజకవర్గానికి ఇచ్చారు. ఆ గిఫ్ట్‌ ఏమిటో తెలుసుకుందాం.

ఇది చదవండి: KCR: బంగారు గొలుసు ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్.. తన స్నేహితుడికి భావోద్వేగ వీడ్కోలు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఉన్న ములుగును కేసీఆర్‌ ప్రభుత్వం జిల్లాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా కొన్ని పెద్ద గ్రామాలను.. మండలాలకు దూరంగా ఉన్న వాటిని పరిపాలనా సౌకర్యం కోసం మండలాలుగా ప్రకటించారు. అయితే ములుగు నియోజకవర్గంలోని మల్లంపల్లి గ్రామాన్ని మండలంగా ఏర్పాటుచేయాలని కొన్నేళ్లుగా డిమాండ్‌ ఉంది. ఎన్నికల ముందు నాడు పాదయాత్ర చేసిన రేవంత్‌ రెడ్డి 'అధికారంలోకి వస్తే మల్లంపల్లిని మండలంగా చేస్తా' అని ప్రకటించారు. తాజాగా మల్లంపల్లిని మండలంగా ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇది చదవండి: Telangana: 8 రోజులపాటు కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏడాది సంబరాలు.. ఏ రోజు ఏమిటో తెలుసా?

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే మల్లంపల్లిని మండలంగా ఏర్పాటవడంతో స్థానిక ఎమ్మెల్యేగా సీతక్క సంబరపడ్డారు. ఈ ప్రకటన వచ్చాక ఆమె మీడియాతో మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు. 'మల్లంపల్లి ప్రాంత ప్రజల పదేళ్ల ఆకాంక్ష. మల్లంపల్లి ప్రత్యేక మండలం కోసం ప్రజలు పదేళ్లుగా ఎన్నో పోరాటాలు చేశారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసి మల్లంపల్లి మండల ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు. ఇప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు' అంటూ సీతక్క తెలిపారు. మండలం కోసం అలుపెరగని పోరాటం చేసి మండలాన్ని సాధించుకున్న మల్లంపల్లి ప్రాంత ప్రజలకు ఈ సందర్భంగా సీతక్క శుభాకాంక్షలు తెలిపారు.

సత్వర సేవలు
అటవీ ప్రాంతమైన ములుగు జిల్లాలో గ్రామాలకు పరిపాలన కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. నియోజకవర్గంలో పెద్ద గ్రామంగా ఉన్న మల్లంపల్లిని మండలంగా చేయాలని గ్రామస్తులు ఉద్యమం చేశారు. ములుగుకు దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం జాతీయ రహదారిపై ఉంది. పరిసర గ్రామాల ప్రజలు కొన్ని ప్రభుత్వ సేవలకు ములుగుకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతుండడంతో హైవేపై ఉన్న మల్లంపల్లిని మండలంగా చేస్తే ప్రయోజనంగా ఉంటుందని పోరాటం చేశారు. తాజాగా ఆ గ్రామస్తుల కల నెరవేరగా.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ప్రభుత్వ సేవలు సత్వరం అందే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News