Health Benefits Of Ivy Gourd: ఐవీ గోర్డ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Ivy Gourd Benefits: పచ్చి దొండకాయలను ప్రతిరోజు నమిలి తినడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే కొన్ని లక్షణాలు దీర్ఘకాలిక వ్యాధులనుంచి కూడా శరీరాన్ని రక్షిస్తాయి. అలాగే గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
బయట మార్కెట్లో విరివిగా లభ్యమయ్యే కూరగాయల్లో దొండకాయ కూడా ఒకటి. దొండకాయను వివిధ రకాలుగా వండుకొని చపాతి, అన్నంతో తినవచ్చు. చూడటానికి చిన్నగా, పొట్టిగా కనపడుతుంది కదా అని దీని గురించి తక్కువ అంచనా వేసుకుంటే పొరబడినట్లే. ఇందులో ఔషధ గుణాలు ఏముంటాయిలే అని అనుకుంటాము. దొండను ఎక్కువగా తింటే మందబుద్ధి వస్తుంది అని చెప్పేవారు కూడా లేకపోలేరు. అయతే అది ఒక అపోహ మాత్రమే.
* దొండకాయలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. పీచూ, ప్రోటీన్లు కూడా లభ్యమవుతాయి.
* ఇందులోని యాక్సిడెంట్లు బాక్టీరియాలను అడ్డుకుంటాయని ఆయుర్వేదం చెబుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.