Aryan Khan: ఆర్యన్ ఖాన్ అరెస్ట్ షారుఖ్ కుటుంబాన్ని కలవరపాటుకు గురిచేసింది. అయితే ఆర్యన్ విడుదల అయ్యేంత వరకు ఇంట్లో స్వీట్లు చేయరాదని అతడి తల్లి గౌరీ ఖాన్ వంట సిబ్బందికి ఆదేశించినట్లు తెలుస్తోంది.
Aryan khan: జైలు నుంచి విడుదల అయిన తర్వాత పేదల సంక్షేమానికి కృషి చేస్తానని.. తనకు చెడ్డపేరు తెచ్చే పనులు చేయబోనని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ శనివారం ఎన్సీబీ అధికారులకు హామీ ఇచ్చాడు.
Aryan Khan: డ్రగ్స్ కేసులో అరెస్టైన ఆర్యన్‌ఖాన్‌కు జైలులో క్యాంటీన్ ఖర్చుల కోసం రూ.4,500 రూపాయలను వాళ్ల కుటుంబీకులు జైలుకు మనియార్డర్ చేశారు. అక్టోబర్ 11న షారుక్ కుటుంబం మనియార్డర్ చేసినట్లు వెల్లడించారు జైలు సూపరింటెండెంట్ నితిన్ వేచల్.
షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే. కొన్ని ఏళ్ల క్రితం షారుక్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇపుడు వైరల్ అవుతుంది.. అదెందుకో మీరే చూడండి!
Legal notice to Revanth Reddy in Minister KTR's defamation suit: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సిటీ సివిల్ కోర్టులో డిఫేమేషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ నేడు కోర్టులో విచారణకు రాగా.. మంత్రి కేటీఆర్ తరపు అడ్వకేట్ తన వాదనలు వినిపించి అందుకు తగిన సాక్ష్యాధారాలను కోర్టుకు అందించారు.
Anchor Anushree: కన్నడ నాట డ్రగ్స్ కేసులో మంగళూరు సీసీబీ పోలీసులు తాజాగా కోర్టుకు చార్జిషీట్ సమర్పించారు. కాగా, ఈ చార్జిషీట్లో ప్రముఖ యాంకర్, నటి అనుశ్రీ పేరును పేర్కొన్నారు. దీంతో ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మళ్లీ శాండల్ వుడ్ లో హాట్ టాఫిక్ గా మారింది.
Sanjana Galrani, Ragini Dwivedi drugs case: డ్రగ్స్ సేవిస్తున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాగిణి ద్వివేది, సంజనల నుంచి సేకరించిన వెంట్రుకల నమూనాల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ జరిపిన పరీక్షల్లో (FSL report) నిర్ధారణ కావడంతో ఆ ఇద్దరూ మరోసారి చిక్కుల్లో పడ్డారు.
డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలతో హాస్యనటి భారతీ సింగ్ (Bharti Singh ) ను నిన్న సాయంత్రం ఎన్సీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె భర్త హర్ష్ లింబాచియా ( Haarsh Limbachiyaa) ను సైతం అరెస్టు చేసినట్లు ఎన్సీబీ అధికారులు ఆదివారం ఉదయం వెల్లడించారు.
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మహత్య నాటినుంచి బాలీవుడ్లో ప్రకంపనలు మొదలైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో బాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం (Bollywood Drugs Case) బయటపడటంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. తాజాగా ఈ డ్రగ్స్ కేసు బాలీవుడ్ బుల్లితెరనూ కూడా తాకింది
Rhea Chakraborty gets bail in Bollywood drugs case: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించిన బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు చేసిన బాంబే హై కోర్టు.. ఆమెకు పలు షరతులు విధించింది. రియా చక్రవర్తి సోదరుడు సోవిక్ చక్రవర్తి బెయిల్ పిటిషన్‌ని ( Showik Chakraborty bail plea) తిరస్కరించిన కోర్టు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మహత్య కేసుతోపాటు డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటూ జైలులో ఉన్న నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty) ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, పలువురి జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది.
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) అనుమానస్పద మృతి నాటినుంచి ఇటు సినీ ఇండస్ట్రీలో.. అటు రాజకీయ వర్గాల్లో వైరం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది.
సుశాంత్ సింత్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత రియా చక్రవర్తి ( Rhea Chakraborty ) చుట్టు ఉచ్చు బిగియడంతో ఇందులో డ్రగ్స్ యాంగిల్ బయటికి వచ్చిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ (Sushant Singh Rajput) అనుమానస్పద మృతి తర్వాత సినీ ఇండస్ట్రీపై పలు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. సుశాంత్ మరణం కేసు దర్యాప్తులో భాగంగా బాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. ఈ విషయంపై ఎన్సీబీ (NCB) అధికారులు లోతుగా దర్యాప్తు ప్రారంభించిన నాటినుంచి డ్రగ్స్ కేసు బీ టౌన్ మొత్తాన్ని వణికిస్తోంది.
సినిమా ఇండస్ట్రీని డ్రగ్స్ కేసు (Drugs Case) వణికిస్తోంది. బాలీవుడ్‌తోపాటు కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ తరహాలోనే శాండల్‌వుడ్‌లో కూడా డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.