ICC Test rankings: Rishabh Pant Becomes Top-Ranked Wicket-Keeper In Batting List: ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కీలక ప్రదర్శన చేసి టీమిండియా సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు.
టీమిండియా యువ ఆటగాళ్లు అద్భుతం చేశారు. నిర్ణయాత్మక చివరిదైన నాలుగో టెస్టులో 3 వికెట్ల తేడాతో ఆతిథ్య ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించింది. తద్వారా బోర్డర్ - గవాస్కర్ సిరీస్‌ను 2-1 తో అజింక్య రహానే సేన సొంతం చేసుకుని రికార్డులు తిరగరాసింది.
Rishabh Pant Fatest Indian Wicketkeeper To Reach 1000 Test Runs భారత యువ క్రికెట్ సంచలనం రిషబ్ పంత్ అరుదైన రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టులో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలుకొట్టాడు. బ్రిస్బేన్ వేదికగా గబ్బా మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్టులో భాగంగా టెస్ట్ కెరీర్లో 1000 పరుగుల మార్కు చేరుకున్నాడు పంత్.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫిలో కీలకమైన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత బౌలర్లు (Team India) చెలరేగుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు.
Did Steve Smith Remove Rishabh Pants Guard Marks: దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో తలెత్తిన బాల్ ట్యాంపరింగ్ వివాదం తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఏం చేసినా తప్పులాగే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నో సిరీస్‌లలో స్టీవ్ స్మిత్‌ను చూసిన ప్రేక్షకులు స్టేడియంలోనే చీటర్ చీటర్ అంటూ అతడ్ని హేళన చేయడం తెలిసిందే.
India vs Australia 4th Test: Jasprit Bumrah Ruled Out Of Brisbane Test: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఆటగాళ్ల గాయాల పరంపరం కొనసాగుతోంది. మూడో టెస్టు అనంతరం రవీంద్ర జడేజా, హనుమ విహారి గాయాల కారణంగా సిరీస్ నుంచి వైదొలిగారు. ఈ జాబితాలో తాజాగా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా చేరాడు.
India vs Australia 3rd Test Highlights: హనుమ విహారి ఇన్నింగ్స్.. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 163 బంతులు ఎదుర్కొన్న విహారి 23 పరుగులు చేసి నౌటౌట్‌గా నిలిచాడు. అయితే టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత నెమ్మదిగా సాగిన తొమ్మిదో ఇన్నింగ్స్ ఇది.
India VS Australia 3rd Test Highlights: ఆస్ట్రేలియా, టీమిండియా జట్ల మధ్య ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ఆతిథ్య ఆసీస్ ఎంతగా యత్నించినా భారత జట్టును ఆలౌట్ చేయలేకపోయింది.
India vs Australia: Cheteshwar Pujara: భారత టపార్డర్ బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్లో 6000 పరుగుల మైలురాయి చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిడ్నీ టెస్టులో వన్‌డౌన్ ఆటగాడు పుజారా ఈ ఫీట్ నమోదు చేశాడు.
Ravichandran Ashwin: ఆస్ట్రేలియా జట్టుతో క్రికెట్ అంటే చాలు.. అందులోనూ వారి గడ్డ మీద అంటే పర్యాటక జట్టుకు ఎన్నో సవాళ్లు. ఓడిపోతారనే ఆలోచన వస్తే చాలు.. ఆటగాళ్లతో పాటు ఆ దేశ అభిమానులు, మ్యాచ్ వీక్షకులు తమ నోటికి పని చెబుతుంటారు. ప్రస్తుతం జరుగుతోన్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇలాంటి ఘటనలు జరిగాయి. జాత్యహంకార వ్యాఖ్యలు చేసి భారత క్రికెటర్లను అవమానిస్తున్నారు. విమర్శలు రావడం, టీమిండియా సైతం అంపైర్లకు ఫిర్యాదు చేయడంతో వివాదం ముదరకూడదని భావించిన క్రికెట్ ఆస్ట్రేలియా క్షమాపణలు సైతం చెప్పింది.
India vs Australia 3rd Test Day 4 Highlights: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. టీమిండియా 2 వికెట్లు నష్టపోయి 98 పరుగులు చేయగా.. అజింక్య రహానే సేన విజయానికి మరో 309 పరుగులు కావాలి.
Ind vs Aus 3rd Test: Steve Smith: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియాతో సిడ్నీ వేడికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ చేశాడు. ఓ టెస్టులో సెంచరీ, హాఫ్ సెంచరీ నమోదు చేసిన అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
India vs Australia 3rd Test Day 2 Highlights: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసింది. ఆట నిలిపివేసే సమయానికి టీమిండియా ఓపెనర్ల వికెట్లను కోల్పోయి 45 ఓవర్లలో 96 పరుగులు చేసింది. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు చేతిలో ఉన్నాయి.
India vs Australia 3rd Test: Ravindra Jadeja: ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ఆల్ రౌండర్లలో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా ఒకడు. అత్యుత్తమ ఫీల్డర్ అంటే గుర్తుకొచ్చే పేర్లలో జడేజా కచ్చితంగా ఉంటాడు. సరిగ్గా నేడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో మరోసారి రవీంద్ర జేడేజా అద్భుతం చేశాడు.
India VS Australia: David Warner: భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. అయితే అంతకుముందే ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుకు టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్ షాకిచ్చాడు. కేవలం 5 పరుగులకే అతడ్ని వెనక్కి పంపాడు సిరాజ్.
KL Rahul ruled out of series with left wrist: కీలకమైన మూడో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ జట్టుకు దూరం కానున్నాడు. ఎడమచేతి మణికట్టు గాయంతో అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
Pacer James Pattinson Ruled Out Of Sydney Test: ఓవైపు బయోబబుల్ తప్పిదాలు, కరోనా వైరస్ భయాలనుంచి టీమిండియా ఊరట పొందగా.. అదే సమయంలో ఆతిథ్య ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగింది. కీలకమైన మూడో టెస్టుకు ఆసీస్ పేసర్ జేమ్స్ పాటిన్సన్ దూరం కానున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో వెల్లడించింది.
India vs Australia 3rd Test: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ లాంటి స్టార్ ప్లేయర్లు లేకున్నా అజింక్య రహానే కెప్టెన్సీలో మెల్బోర్న్ టెస్టులో భారత జట్టు అద్భుతం చేసింది. అయితే ఆసీస్ జట్టు తమ లోపాలను సరిదిద్దుకునే చర్యలు చేపట్టినట్లు కనిపిస్తోంది.
AUS v IND 2nd Test Highlights: ఆస్ట్రేలియా గడ్డపై తొలిటెస్టులో ఎదురైన పరాభవానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. అడిలైడ్ టెస్టులో 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైన భారత క్రికెట్ జట్టు.. మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్టులో నాలుగో రోజే ఆట ముగించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.