KL Rahul Ruled Out Of Series: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ

KL Rahul ruled out of series with left wrist: కీలకమైన మూడో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ జట్టుకు దూరం కానున్నాడు. ఎడమచేతి మణికట్టు గాయంతో అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

Last Updated : Jan 5, 2021, 11:19 AM IST
  • కీలకమైన మూడో టెస్టుకు ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ
  • మిగిలిన రెండు టెస్టులకు భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ దూరం
  • జనవరి 7న టీమిండియా, ఆస్ట్రేలియాల మధ్య ప్రారంభం కానున్న టెస్టు
KL Rahul Ruled Out Of Series: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ

KL Rahul ruled out of series with left wrist: కీలకమైన మూడో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ జట్టుకు దూరం కానున్నాడు. ఎడమచేతి మణికట్టు గాయంతో ఆస్ట్రేలియాతో జరగనున్న చివరి రెండు టెస్టులకు కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

రెండో టెస్టులో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో అదరగొట్టిన టీమిండియా మరో కీలక ఆటగాడు లేకుండానే మిగతా రెండు టెస్టులు ఆడనుంది. ఇదివరకే రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ లాంటి ఆటగాళ్ల సేవలు కోల్పోయిన భారత క్రికెట్ జట్టు సిరీస్‌లో తదుపరి టెస్టులకు మరో కీలక ఆటగాడు కేఎల్ రాహుల్(KL Rahul) సేవల్ని కోల్పోనుంది. 

Also Read: IND vs AUS 3rd Test: బీసీసీఐ శుభవార్త.. భారత జట్టుకు భారీ ఊరట

 

ఆస్ట్రేలియా, టీమిండియా(India vs Australia) మధ్య జనవరి 7న ప్రారంభం కానున్న సిడ్నీ టెస్టు కోసం ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో శనివారం రాహుల్ గాయపడ్డాడు. అతడ్ని పరీక్షించిన ఫిజయో, టీమ్ మేనేజ్‌మెంట్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌కు విశ్రాంతి ఇచ్చింది. అతడు భారత్‌కు తిరిగొచ్చి బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(NCA)లో చేరనున్నాడని బీసీసీఐ స్పష్టం చేసింది.

Also Read: Credit Card Tips: ఫస్ట్ టైం క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి

కాగా, టీ20, వన్డే సిరీస్‌లో పరుగుల వరద పారించిన కేఎల్ రాహుల్‌కు టెస్ట్ సిరీస్‌లో తొలి రెండు టెస్టులకు అవకాశం ఇవ్వలేదు. దీంతో మాజీలు, క్రికెట్ విశ్లేషకుల నుంచి విమర్శలు రావడంతో చివరి రెండు టెస్టులకు రాహుల్‌ను ఎంపిక చేశారు. యంగ్ ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీ షా విఫలం కావడంతో మూడో టెస్టులో బరిలోకి దిగుతాడనుకుంటే కేఎల్ రాహుల్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు.

Also Read: Indian Cricketers Retired In 2020: ఈ ఏడాది రిటైరైన భారత క్రికెటర్లు వీరే 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News