తమ తొలి మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Kings Xi Punjab)పై ‘సూపర్’ విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals). తర్వాతి మ్యాచ్కు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin Injury) సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.
దుబాయ్ వచ్చి క్వారంటైన్ పూర్తి చేసుకున్న ఢిల్లీ టీమ్ (Delhi Capitals) విజయవంతంగా తమ ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంది. దుబాయ్ హోటల్లో బస చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి బయలుదేరింది.
ఐపీఎల్ 2020 జరగనున్న దుబాయ్లో విమానాశ్రయాల్లో స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చిన కుక్కల్ని నియమిస్తున్నారు. కోవిడ్19 లక్షణాలు ఉన్నట్లు (Dogs to Sniff Out COVID19 Cases) కనిపించిన వ్యక్తులను గుర్తించడం వీటి పని. ఇందుకోసం వీటికి కోవిడ్19 శిక్షణ ఇస్తారు.
ఎయిర్పోర్టు అంటేనే భద్రతకు, సరైన తనిఖీకి పెట్టింది పేరు. అలాంటి ఎయిర్ పోర్టులో అప్పుడప్పుడు చెకింగ్ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. ఓ మహిళ పొరపాటున గమనించకుండా తన పాస్ పోర్టు బదులు భర్త పాస్ పోర్టు తీసుకొని ఎయిర్ పోర్టుకి వచ్చేసింది.
దుబాయ్లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సదస్సు సందర్భంగా తన అభిప్రాయాలను పంచుకున్న ఆయన ప్రసంగంలోని పలు ఆసక్తికరమైన విషయాలు మీకోసం ప్రత్యేకం
దుబాయ్ లో విదేశీయుల ప్రాపర్టీ కొనుగోళ్లలో భారతీయులు ముందంజలో ఉన్నారు. గతేడాది 2016 జనవరి నుంచి ఈ ఏడాది 2017 జూన్ వరకు భారతీయులు దుబాయ్ లో రూ.42వేల కోట్ల విలువైన ఆస్తులను దక్కించుకున్నారు. భారతీయుల్లో ఎక్కువమంది అపార్ట్మెంట్లపై, మరికొందరు విలాలపై ఆసక్తిని చూపిస్తున్నారట. ఈ విషయం అక్కడి ల్యాండ్ డిపార్ట్మెంట్ వెల్లడించిన లెక్కల ద్వారా స్పష్టమవుతోంది.
ప్రవాసాంధ్రులకు సహాయ వారధిలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విదేశీ పర్యటనలో భాగంగా శనివారం ముఖ్యమంత్రి బృందం దుబాయ్ చేరుకున్నారు. సాయంత్రం ఏపీఎన్ఆర్టీ నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. "మీరు ఒంటరి వాళ్లు కాదు.. మీ వెంట రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నేను ఉంటాను. మీ కోసం మరెవరూ చేయని మంచి విధానాలను నేను చేస్తాను.."అని ప్రవాసాంధ్రులకు భరోసా ఇచ్చారు చంద్రబాబు. ఈ సమావేశంలోనే సీఎం మూడు ప్రత్యేక కార్యక్రమాలను ప్రకటించి, 40 కోట్ల రూపాయలను కేటాయించారు.
మూడు రోజుల అమెరికా పర్యటనను విజయవంతంగా పూర్తిచేసుకొని, శనివారం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) బయల్దేరారు. ముఖ్యమంత్రి బృందం శనివారం నుంచి రెండు రోజులపాటు యూఏఈలో పర్యటించనుంది. భారత కాలగమనం ప్రకారం శనివారం మధ్యాహ్నం ఈ బృందం దుబాయ్ చేరుకోనుంది. పర్యటనలో భాగంగా ముందుగా శనివారం దుబాయిలోని షేక్ రాషేద్ ఆడిటోరియంలో(భారతీయ పాఠశాల) లో ప్రవాసాంధ్రులతో భేటీకానున్నారు. ప్రవాసీ సంక్షేమ విధానంలో భాగంగా ప్రవాసాంధ్ర భరోసా, ప్రవాసాంధ్ర హెల్ప్ లైన్ కార్యక్రమాలను అమలును వెల్లడించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.