T20 World Cup 2022: దాయాదిపై గెలిచి మాంచి ఊపు మీదున్న భారత్ ఇవాళ పనికూన నెదర్లాండ్స్‌ను ఢీకొనబోతుంది. నెదర్లాండ్స్‌తో ఓ టీ20 మ్యాచ్‌లో తలపడడం టీమిండియాకు ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను తేలిగ్గా తీసుకోకుండా భారత్ ఆడాలి. ఎందుకంటే గతంలో టీ20 వరల్డ్ కప్ ల్లో ఈ జట్టు ఇంగ్లాండ్‌కు షాకిచ్చింది. గురువారం జరగబోయే మ్యాచ్ సిడ్నీ వేదికగా మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభంకానుంది.
సఫారితో పోరుకు ముందు నెదర్లాండ్స్‌తో మ్యాచ్ టీమిండియాకు కీలకంకానుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ ద్వారా భారత్ తన లోపాలను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. పాక్ పై గెలిచినప్పటికీ టీమిండియా బ్యాటింగ్ సంతృప్తికరంగా లేదనే చెప్పాలి. కెప్టెన్ రోహిత్, కేఎల్ రాహుల్ తమ ఫామ్ ను అందుకోవాల్సి ఉంది. నిలకడలేమితో ఇబ్బంది పడుతున్న రాహుల్ ఈ మ్యాచ్ ద్వారానైనా గాడిన పడాలని అందరూ కోరుకుంటున్నారు. కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, పాండ్యాల ఫామ్ లో ఉండటం భారత్ కు కలిసొచ్చే అంశం. టీమిండియా బౌలింగ్ విషయానికొస్తే.. ఇవాల్టి మ్యాచ్ లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. పాక్ తో ఆడిన టీమ్ తోనే ఆడతామని బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే చెప్పాడు.
ఈ మ్యాచ్ లో టీమిండియాపై గెలవడం నెదర్లాండ్స్‌కు కష్టమైన పనే. పెద్ద జట్లుతో తలపడటం వల్ల తమ టీమ్ మెరుగుపడటమే కాకుండా.. ఎదగడానికి ఉపయోగపడతుందని నెదర్లాండ్స్ భావిస్తోంది. తన తొలి సూపర్-12లో మ్యాచ్ లో బంగ్లాను దాదాపు ఓడిచినంత పని చేసింది. బౌలింగ్ పరంగా ఆ జట్టు బాగానే కనిపిస్తోంది. నెదర్లాండ్ బౌలర్లు భారత బ్యాట్స్ మెన్స్ ను కట్టడి చేయడం సవాలుతో కూడుకున్న పనే. బ్యాటింగే ఆ జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. బ్యాటింగ్ భారమంతా మ్యాక్స్ ఒడౌడ్ ఒక్కడిపైనే పడుతుంది. ఇతరుల నుంచి అతడికి సహకరం లభిస్తేనే నెదర్లాండ్స్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
Also Read: England vs Ireland: టీ20 వరల్డ్ కప్‌లో సంచలనం.. ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఐర్లాండ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి