సురేష్ రైనా ( Suresh Raina ) కూడా క్రికెట్ లవర్స్‌కి షాక్ ఇచ్చాడు. మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni ) ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన కొద్దిసేపటికే సురేష్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పేశాడు ( Suresh raina retires ). టీమిండియాలో ఇద్దరు కీలక ఆటగాళ్లు ఒకేరోజు రిటైర్మైంట్ ప్రకటించడం క్రీడావర్గాల్లో చర్చనియాంశమైంది. ఇరువురి రిటైర్మైంట్ ప్రకటన వారి అభిమానులకు షాక్‌కి గురిచేసింది. Also read : MS Dhoni: ధోని మరో రెండేళ్లు ఆడతాడు
మహేంద్ర సింగ్ ధోనీ, సురేష్ రైనా ఇద్దరూ చెన్నై సూపర్ కింగ్స్ ( CSK ) జట్టు తరపున IPL 2020 లో పాల్గొననున్న నేపథ్యంలో ప్రాక్టీస్ కోసం ఇద్దరు ఆటగాళ్లు చెన్నైకి చేరుకున్న సంగతి తెలిసిందే. Also read : #Watch Suresh Raina: ధోనీ తర్వాత మళ్లీ తనే.. రోహిత్ శర్మపై రైనా ప్రశంసలు